KTR : నేను వస్తే.. రేవంత్ పారిపోయాడు.. ఇప్పటికైనా నేను ఎక్కడికంటే అక్కడికి సిద్ధం : కేటీఆర్
ప్రధానాంశాలు:
KTR : నేను వస్తే..రేవంత్ పారిపోయాడు.. ఇప్పటికైనా నేను ఎక్కడికంటే అక్కడికి సిద్ధం : కేటీఆర్
KTR : తెలంగాణ Telangana రాజకీయాల్లో వేడి చల్లారకముందే మరోసారి తీవ్ర విమర్శలు చేసారు BRS Party బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. “సవాల్ చేశావ్, మేమొచ్చాం, నువ్వెందుకు రాలేదు?” అంటూ ప్రశ్నించారు. తాను రైతుల సమస్యలపై చర్చకు సిద్ధంగా వచ్చానని, కనీసం సీఎం రాలేకపోయినా ఒక మంత్రిని అయినా పంపించాల్సిందన్నారు. “రచ్చ చేయడం కాకుండా చర్చ చేయడం నేర్చుకోవాలి” అంటూ రేవంత్‌పై సెటైర్లు వేశారు.

KTR : నేను వస్తే.. రేవంత్ పారిపోయాడు.. ఇప్పటికైనా నేను ఎక్కడికంటే అక్కడికి సిద్ధం : కేటీఆర్
KTR : ఇప్పటికైనా నేను ఎక్కడికంటే అక్కడికి సిద్ధం
తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్యమైన అంశాలైన నీళ్లు, నిధులు, ఉద్యోగాలు రేవంత్ రెడ్డి Revanth reddy పాలనలో పక్క రాష్ట్రాలకు, ఢిల్లీకి వెళ్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. శ్రీశైలం, బనకచర్ల ద్వారా నీళ్లు ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లిపోతున్నాయని, కేంద్రానికి నిధులు తరలిపోతున్నాయని, ఉద్యోగాలు మాత్రం కాంగ్రెస్ నేతల బినామీలకే ఇవ్వబడుతున్నాయని విమర్శించారు. అలాగే, రైతులకు నెలకు రూ.2500 ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రేవంత్ స్వయంగా ఉన్న నియోజకవర్గంలోనే రైతులకు రుణమాఫీ జరగలేదని అన్నారు.
రైతుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి వేసిన సవాల్‌ను స్వీకరించిన కేటీఆర్, చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. కోడంగల్, చింతమడక, గజ్వేల్ ఎక్కడైనా వస్తానని స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జూలై 8 ఉదయం 11 గంటలకు తాను హాజరవుతానని ముందుగానే వెల్లడించినట్లు గుర్తుచేశారు. సీఎం రేవంత్‌కు ప్రత్యేకంగా కుర్చీ కూడా సిద్ధం చేశామని తెలిపారు. “కేసీఆర్ పాలనపై విమర్శలు చేయాలంటే నాలుగు సార్లు ఆలోచించండి” అంటూ సీఎం రేవంత్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఇక కేటీఆర్ వ్యాఖ్యలకు అటు కాంగ్రెస్ నేతలు సైతం కౌంటర్లు ఇస్తున్నారు.