KTR : రాజముద్రలో అమరవీరులు ఉండొద్దా కేటీఆర్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

KTR : రాజముద్రలో అమరవీరులు ఉండొద్దా కేటీఆర్..!

KTR : తెలంగాణలో ఇప్పుడు రాజముద్రపై రాజకీయాలు నడుస్తున్నాయి. మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అధికారిక చిహ్నాన్ని మారుస్తామని తెలిపారు. ఇప్పుడున్న రాజముద్రలో రాజరిక వాసనలు కనిపిస్తున్నాయి తప్ప.. తెలంగాణ అమరవీరుల త్యాగాలు కనిపించట్లేదని ఆయన వాపోయారు. అందుకే అధికారిక చిహ్నం మీద తెలంగాణ అమర వీరుల త్యాగాలను గుర్తు చేసేలా రాజముద్రను మారుస్తాం అని ఆయన తెలిపారు. అయితే దానిపై ఇప్పుడు కేటీఆర్ భగ్గుమంటున్నారు. ఆయన మాట్లాడుతూ.. అధికారిక చిహ్నాని ఎలా మారుస్తారని ప్రశ్నిస్తున్నారు. […]

 Authored By ramu | The Telugu News | Updated on :29 May 2024,9:00 pm

KTR : తెలంగాణలో ఇప్పుడు రాజముద్రపై రాజకీయాలు నడుస్తున్నాయి. మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అధికారిక చిహ్నాన్ని మారుస్తామని తెలిపారు. ఇప్పుడున్న రాజముద్రలో రాజరిక వాసనలు కనిపిస్తున్నాయి తప్ప.. తెలంగాణ అమరవీరుల త్యాగాలు కనిపించట్లేదని ఆయన వాపోయారు. అందుకే అధికారిక చిహ్నం మీద తెలంగాణ అమర వీరుల త్యాగాలను గుర్తు చేసేలా రాజముద్రను మారుస్తాం అని ఆయన తెలిపారు. అయితే దానిపై ఇప్పుడు కేటీఆర్ భగ్గుమంటున్నారు. ఆయన మాట్లాడుతూ.. అధికారిక చిహ్నాని ఎలా మారుస్తారని ప్రశ్నిస్తున్నారు.

KTR కాంగ్రెస్ ఫైర్..

రాజకీయ ఆనవాళ్లను తొలగించాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి సర్కార్ సంకుచితంగా ఆలోచిస్తోందని తెలిపారు. ఓరుగల్లు సాక్షిగా మరో ఉద్యమాన్ని రగిల్చి రేవంత్ రెడ్డి సర్కార్ మీద పోరాడుతాం.. రాష్ట్ర రాజముద్రలో తెలంగాణలో సంస్కృతి వారసత్వానికి ప్రతీకలైన కాకతీయ తోరణం, చార్మినార్ ఉండటం రాచరిక పోకడ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించడం కరెక్టు కాదు. వెయ్యేళ్ల సాంస్క్రతి వైభవానికి అవి చిహ్నాలు. పదేళ్లుగా ప్రభుత్వ అధికారిక చిహ్నంపై తెలంగాణ సమాజం ఆమోద ముద్ర ఉంది అంటూ కేటీఆర్ మాట్లాడారు. అయితే ఇప్పుడు ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ భగ్గుమంటోంది.

KTR రాజముద్రలో అమరవీరులు ఉండొద్దా కేటీఆర్

KTR : రాజముద్రలో అమరవీరులు ఉండొద్దా కేటీఆర్..!

ఎందుకంటే అధికారిక చిహ్నంలో ఎంతసేపు రాజముద్రలు కనిపించాలని కేటీఆర్ భావిస్తున్నారే తప్ప.. అమరవీరులు కనిపించాలని ఆయన అనుకోకపోవడం ఏంటని మండిపడుతున్నారు. ఎంత మంది కేసీఆర్ లు పోరాడినా సరే.. గుప్పెడు మంది అమరవీరులు లేకుంటే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి వచ్చేదా.. కేంద్రం ఉద్యమాన్ని గుర్తించేదా అని ప్రశ్నిస్తున్నారు. జాతీయ పార్టీలు తెలంగాణ పట్ల కనికరం చూపించాయి అంటే అది ఉద్యమకారులు, అమరవీరుల త్యాగాల ఫలితమే కదా అని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన సామాన్యులు రాజముద్రలో ఎందుకు భాగస్వామ్యం కాకూడదు అని ప్రశ్నిస్తున్నారు. వారి ఆశలు.. ఆకాంక్షల్ని అనుక్షణం గుర్తుకు తెచ్చుకునేలా రాజముద్రలో వారు ఉండొద్దా? చరిత్రను కొనసాగించాలనే కేటీఆర్.. వర్తమానాన్ని ఎందుకు భాగస్వామ్యం చేయొద్దని భావిస్తున్నారు అని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది