KTR : తెలంగాణలో ఇప్పుడు రాజముద్రపై రాజకీయాలు నడుస్తున్నాయి. మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అధికారిక చిహ్నాన్ని మారుస్తామని తెలిపారు. ఇప్పుడున్న రాజముద్రలో రాజరిక వాసనలు కనిపిస్తున్నాయి తప్ప.. తెలంగాణ అమరవీరుల త్యాగాలు కనిపించట్లేదని ఆయన వాపోయారు. అందుకే అధికారిక చిహ్నం మీద తెలంగాణ అమర వీరుల త్యాగాలను గుర్తు చేసేలా రాజముద్రను మారుస్తాం అని ఆయన తెలిపారు. అయితే దానిపై ఇప్పుడు కేటీఆర్ భగ్గుమంటున్నారు. ఆయన మాట్లాడుతూ.. అధికారిక చిహ్నాని ఎలా మారుస్తారని ప్రశ్నిస్తున్నారు.
రాజకీయ ఆనవాళ్లను తొలగించాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి సర్కార్ సంకుచితంగా ఆలోచిస్తోందని తెలిపారు. ఓరుగల్లు సాక్షిగా మరో ఉద్యమాన్ని రగిల్చి రేవంత్ రెడ్డి సర్కార్ మీద పోరాడుతాం.. రాష్ట్ర రాజముద్రలో తెలంగాణలో సంస్కృతి వారసత్వానికి ప్రతీకలైన కాకతీయ తోరణం, చార్మినార్ ఉండటం రాచరిక పోకడ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించడం కరెక్టు కాదు. వెయ్యేళ్ల సాంస్క్రతి వైభవానికి అవి చిహ్నాలు. పదేళ్లుగా ప్రభుత్వ అధికారిక చిహ్నంపై తెలంగాణ సమాజం ఆమోద ముద్ర ఉంది అంటూ కేటీఆర్ మాట్లాడారు. అయితే ఇప్పుడు ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ భగ్గుమంటోంది.
ఎందుకంటే అధికారిక చిహ్నంలో ఎంతసేపు రాజముద్రలు కనిపించాలని కేటీఆర్ భావిస్తున్నారే తప్ప.. అమరవీరులు కనిపించాలని ఆయన అనుకోకపోవడం ఏంటని మండిపడుతున్నారు. ఎంత మంది కేసీఆర్ లు పోరాడినా సరే.. గుప్పెడు మంది అమరవీరులు లేకుంటే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి వచ్చేదా.. కేంద్రం ఉద్యమాన్ని గుర్తించేదా అని ప్రశ్నిస్తున్నారు. జాతీయ పార్టీలు తెలంగాణ పట్ల కనికరం చూపించాయి అంటే అది ఉద్యమకారులు, అమరవీరుల త్యాగాల ఫలితమే కదా అని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన సామాన్యులు రాజముద్రలో ఎందుకు భాగస్వామ్యం కాకూడదు అని ప్రశ్నిస్తున్నారు. వారి ఆశలు.. ఆకాంక్షల్ని అనుక్షణం గుర్తుకు తెచ్చుకునేలా రాజముద్రలో వారు ఉండొద్దా? చరిత్రను కొనసాగించాలనే కేటీఆర్.. వర్తమానాన్ని ఎందుకు భాగస్వామ్యం చేయొద్దని భావిస్తున్నారు అని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.