KTR : అంతా నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే జ‌రిగింది.. ఫార్మూలా-ఇ కేసు : కేటీఆర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KTR : అంతా నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే జ‌రిగింది.. ఫార్మూలా-ఇ కేసు : కేటీఆర్

 Authored By ramu | The Telugu News | Updated on :20 December 2024,11:18 am

ప్రధానాంశాలు:

  •  KTR : అంతా నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే జ‌రిగింది.. ఫార్మూలా-ఇ కేసు : కేటీఆర్

KTR  : హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా-ఇ రేస్‌లో Formula E race case సుమారు 55 కోట్ల రూపాయల ఆర్థిక అవకతవకలకు సంబంధించి BRS  బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కెటి రామారావుపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) గురువారం కేసు నమోదు చేసింది. కెటిఆర్‌పై అవినీతి నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్లు మరియు భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్లు 409 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన) మరియు 120 బి (నేరపూరిత కుట్ర) కింద కేసు నమోదు చేయబడింది.కెటిఆర్‌ను ప్రధాన నిందితుడిగా (ఎ-1), సీనియర్ ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ మరియు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ) రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్ రెడ్డిని ఎ-2 నిందితులుగా పేర్కొన్నారు.

కేబినెట్ ఆమోదం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం, రేస్‌ నిర్వాహకుల మధ్య ఒప్పందం జరిగిందని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్న సమయంలోనే ఇది జరిగిందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.ఈ పరిణామంపై స్పందించిన కేటీఆర్ .. ఈ కేసులో రూ.55 కోట్లను ఇచ్చిన మాట వాస్తవమే అన్నారు. కానీ నిబంధనల ప్రకారమే అంతా జ‌రిగిన‌ట్లు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారానికి తనదే బాధ్యత అని, అధికారులు తన ఆదేశాలతోనే అంతా చేశారని వెల్ల‌డించారు. దీనికి పూర్తి బాధ్యత మాత్రం తనదే అని పేర్కొన్నారు.

KTR అంతా నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే జ‌రిగింది ఫార్మూలా ఇ కేసు కేటీఆర్

KTR : అంతా నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే జ‌రిగింది.. ఫార్మూలా-ఇ కేసు : కేటీఆర్

KTR  కేసు త‌న వ‌ర‌కే ప‌రిమిత‌మ‌య్యేలా కేటీఆర్ వ్యూహం !

ఈ కేసులో కేటీఆర్ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలితే శిక్ష తనకు మాత్రమే పడేలా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న‌ట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలా కాకుండా కేసును మరింత లోతుగా విచారిస్తే అది బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారగలద‌ని, అందుకే కేటీఆర్ కేసును తనవరకే పరిమితం చేసేలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

KTR  క్వాష్ పిటిషన్ వేస్తారా?

ఈ కేసును కొట్టివేయాల్సిందిగా హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేస్తారని తెలుస్తోంది. కేటీఆర్ ఓవైపు ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూనే మరోవైపు అరెస్టుకు సిద్ధపడుతూ కేసును తనవరకే పరిమితం అయ్యేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. KTR, Formula-E case Race , Formula-E, cm revanth reddy

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది