Rythu Bharosa Funds : రైతు భరోసా నిధుల విడుదలపై తాజా అప్డేట్..ఆ రోజు నుంచే అకౌంట్లోకి డబ్బులు జమ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rythu Bharosa Funds : రైతు భరోసా నిధుల విడుదలపై తాజా అప్డేట్..ఆ రోజు నుంచే అకౌంట్లోకి డబ్బులు జమ..!

 Authored By suma | The Telugu News | Updated on :19 January 2026,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Rythu Bharosa Funds : రైతు భరోసా నిధుల విడుదలపై తాజా అప్డేట్..ఆ రోజు నుంచే అకౌంట్లోకి డబ్బులు జమ..!

Rythu Bharosa Funds: రైతులకు అత్యంత కీలకమైన రైతు భరోసా పథకంRythu Bharosa Scheme పై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. కొంతకాలంగా రైతులు ఎదురుచూస్తున్న ఈ నిధుల విడుదలపై ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చింది. సంక్రాంతి పండుగకే రైతు భరోసా నిధులు జమ అవుతాయని మొదట భావించినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది అమలు కాలేదు. ఇప్పుడు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కసరత్తు చేసి విడతల వారీగా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

Rythu Bharosa Funds రైతు భరోసా నిధుల విడుదలపై తాజా అప్డేట్ ఆ రోజు నుంచే అకౌంట్లోకి డబ్బులు జమ

Rythu Bharosa Funds : రైతు భరోసా నిధుల విడుదలపై తాజా అప్డేట్.. ఆ రోజు నుంచే అకౌంట్లోకి డబ్బులు జమ..!

Rythu Bharosa Funds: ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు..ప్రభుత్వ తాజా నిర్ణయం

రైతు భరోసా నిధుల విషయంలో గత కొన్ని వారాలుగా స్పష్టత లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. అయితే తాజా సమాచారం ప్రకారం జనవరి 26వ తేదీ January 26thనుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు జనవరి నెలాఖరు లోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. అయినప్పటికీ రైతు భరోసా పథకం గతం నుంచి అమలులో ఉన్నదే కావడంతో ఎన్నికల కోడ్ వచ్చినా నిధుల విడుదలకు ఎలాంటి అడ్డంకులు ఉండవని అధికారులు చెబుతున్నారు. ఈ అంశంపై రాష్ట్ర రైతు కమిషన్ ఛైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి కూడా స్పందించారు. రైతులకు జనవరి చివరి నాటికి రైతు భరోసా నిధులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు.

Rythu Bharosa Funds: అర్హతల్లో మార్పులు.. పంట భూములకే రైతు భరోసా

ఈసారి రైతు భరోసా అమలులో ప్రభుత్వం కీలక మార్పులు Key changes చేసింది. ఇప్పటి వరకు అన్ని భూములకు రైతు భరోసా అందించగా ఇకపై పంట సాగు జరుగుతున్న భూములకు మాత్రమే ఈ పథకం వర్తింపజేయాలని నిర్ణయించింది. నిజంగా వ్యవసాయం చేస్తున్న రైతులకు మాత్రమే లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ మార్పు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో శాటిలైట్ సర్వే ఆధారంగా పంటలు సాగు అవుతున్న భూములను గుర్తించే ప్రక్రియ చేపట్టారు. వ్యవసాయ యూనివర్సిటీ సహకారంతో ఈ సర్వే నిర్వహించగా దీనికి సంబంధించిన తుది నివేదిక త్వరలో ప్రభుత్వానికి అందనుంది. ఆ నివేదిక ఆధారంగానే అర్హుల జాబితాను ఖరారు చేయనున్నారు. ఇప్పటి వరకు రైతు భరోసా పొందుతున్న లబ్ధిదారుల్లో అర్హతల మేరకు కోత విధించినట్లు తెలుస్తోంది. కేవలం అర్హులకే నిధులు అందేలా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.

Rythu Bharosa Funds: ప్రభుత్వ నిర్ణయం వెనుక ఉద్దేశ్యం

గత ప్రభుత్వం అన్ని రకాల భూములకు రైతు భరోసా అందించిందని కానీ తమ ప్రభుత్వం మాత్రం నిజమైన రైతులకు మాత్రమే ప్రయోజనం కలిగించేలా నిర్ణయం తీసుకుందని మంత్రులు చెబుతున్నారు. భూమి ఉన్న ప్రతి ఒక్కరూ రైతులు కాదని పంట సాగు చేస్తున్న వారికే ఈ పథకం వర్తించాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా వెల్లడించారు. మేడారంలో తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై అధికారిక చర్చ జరగలేదని సమాచారం. అయినప్పటికీ అంతర్గతంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమైందని తెలుస్తోంది. రైతులకు ఎంతో కీలకమైన రైతు భరోసా నిధులు త్వరలోనే ఖాతాల్లోకి జమ కానున్నాయి. కొంత ఆలస్యం జరిగినా అర్హులైన రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పవచ్చు. రైతు భరోసా నిధుల కోసం రైతులు ఇక కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే.

suma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది