Loyola School : విద్యార్థినిపై లైంగిక వేధింపులు : స్కూల్ ప్రిన్సిపాల్ అరెస్టు..!
ప్రధానాంశాలు:
Loyola School : విద్యార్థినిపై లైంగిక వేధింపులు : స్కూల్ ప్రిన్సిపాల్ అరెస్టు..!
Loyola School : పాఠశాలలో చదివే విద్యార్థినిపై అత్యాచారయత్నం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని లయోలా పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యా బుద్దులు చెప్పాల్సిన స్కూల్స్ ప్రిన్సిపల్ విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసినట్లుగా ఆరోపణ.

Loyola School : విద్యార్థినిపై లైంగిక వేధింపులు : స్కూల్ ప్రిన్సిపాల్ అరెస్టు..!
ఇబ్రహీంపట్నం పోలీసులు పాఠశాల ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేశారు. ప్రైవేట్ పాఠశాలను నడుపుతున్న నిందితుడు దీనవత్ రావు, పాఠశాల ఆవరణలోనే బాలికపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లుగా సమాచారం.
బాధితురాలు తన తల్లికి లైంగిక వేధింపుల గురించి తెలియజేయడంతో కుటుంబ సభ్యులు పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచి, ఆపై జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. గతంలోనూ ప్రిన్సిపల్ పై పలు ఆరోపణలు. విద్యార్థినిలను లోబర్చుకొని అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. School principal, Hyderabad, POCSO Act, Dinavath Rao, Ibrahimpatnam