TPCC President : తెలంగాణా కాంగ్రెస్ లో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. తెలంగాణ వచ్చిన పదేళ్ల తర్వాత అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ఓ వైపు ప్రజా పాలనతో పాటుగా పార్టీలో అసంతృప్తిగా ఉన్న వారిని కూడా సెట్ రైట్ చేస్తుంది. ముఖ్యంగా పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న వారికి తగిన ప్రాముఖ్యత ఇవ్వట్లేదని అంటూ గోనుక్కోవడం కామన్ అయ్యింది. ఐతే సీనియర్స్ ని పక్కన పెట్టడం వెనక కాంగ్రెస్ వ్యూహం ఏంటో ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది.
ఇక టీపీసీసీ చీఫ్ పదవికి ఎంతోమంది ఖర్చీఫ్ వేశారు. కాంగ్రెస్ మంత్రులతో సహా ముఖ్య నేతలంగా కూడా పీసీసీ అధ్యక్ష పదవి కావాలని అనుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు కోమటిరెడ్డి బ్రదర్స్, జగ్గారెడ్డి, మధుయాష్కీ, బలరాం నాయక్ ఇలా అందరు తమకే పదవి కావాలని పట్టుబట్టారు. ఐతే అధిష్టానం మాత్రం పార్టీ అధ్యక్ష పదవిపై స్పష్టమైన సంకేతాలను పంపించింది.
ఈసారి టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ని ఎంపిక చేసినట్టు సమాచారం. హైకమాండ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరు గౌరవించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ నే కొత్త టీపీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసిందని తెలుస్తుంది. ఐతే ఈ ఎంపిక వల్ల కొందరు అసంతృప్తిగా ఉన్నా కాంగ్రెస్ ఒక వ్యూహం తోనే అధ్యక్ష పదవి ఎంపిక జరిపినట్టు తెలుస్తుంది.
తెలంగాణాలోనే కాదు ఈసారి కేంద్రంలో కూడా కాంగ్రెస్ బలంగా కనిపించింది. ఐతే రాష్ట్ర రాజకీయాల్లో క్రీయాశీలంగా ఉండేలా పీసీసీ చీఫ్ లను తయారు చేస్తుంది. ఈ క్రమంలో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్ ని తెలంగాణా చీఫ్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఐతే దీనిపై కాంగ్రెస్ ముఖ్య నాయకులు చెరో మాట చెప్పుకుంటున్నా బయటకు చెప్పలేని పరిస్థితి వారిదని తెలుస్తుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.