TPCC president : టీపీసీసీ కొత్త చీఫ్ ఆయనేనా.. గౌడ్ సాబ్ కి పార్టీ పగ్గాలు ఇచ్చిన కాంగ్రెస్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TPCC president : టీపీసీసీ కొత్త చీఫ్ ఆయనేనా.. గౌడ్ సాబ్ కి పార్టీ పగ్గాలు ఇచ్చిన కాంగ్రెస్..!

 Authored By ramu | The Telugu News | Updated on :3 July 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  TPCC president : టీపీసీసీ కొత్త చీఫ్ ఆయనేనా.. గౌడ్ సాబ్ కి పార్టీ పగ్గాలు ఇచ్చిన కాంగ్రెస్..!

TPCC President : తెలంగాణా కాంగ్రెస్ లో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. తెలంగాణ వచ్చిన పదేళ్ల తర్వాత అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ఓ వైపు ప్రజా పాలనతో పాటుగా పార్టీలో అసంతృప్తిగా ఉన్న వారిని కూడా సెట్ రైట్ చేస్తుంది. ముఖ్యంగా పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న వారికి తగిన ప్రాముఖ్యత ఇవ్వట్లేదని అంటూ గోనుక్కోవడం కామన్ అయ్యింది. ఐతే సీనియర్స్ ని పక్కన పెట్టడం వెనక కాంగ్రెస్ వ్యూహం ఏంటో ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది.

ఇక టీపీసీసీ చీఫ్ పదవికి ఎంతోమంది ఖర్చీఫ్ వేశారు. కాంగ్రెస్ మంత్రులతో సహా ముఖ్య నేతలంగా కూడా పీసీసీ అధ్యక్ష పదవి కావాలని అనుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు కోమటిరెడ్డి బ్రదర్స్, జగ్గారెడ్డి, మధుయాష్కీ, బలరాం నాయక్ ఇలా అందరు తమకే పదవి కావాలని పట్టుబట్టారు. ఐతే అధిష్టానం మాత్రం పార్టీ అధ్యక్ష పదవిపై స్పష్టమైన సంకేతాలను పంపించింది.

TPCC president కాంగ్రెస్ కొత్త ప్లాన్ అదేనా

ఈసారి టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ని ఎంపిక చేసినట్టు సమాచారం. హైకమాండ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరు గౌరవించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ నే కొత్త టీపీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసిందని తెలుస్తుంది. ఐతే ఈ ఎంపిక వల్ల కొందరు అసంతృప్తిగా ఉన్నా కాంగ్రెస్ ఒక వ్యూహం తోనే అధ్యక్ష పదవి ఎంపిక జరిపినట్టు తెలుస్తుంది.

TPCC president టీపీసీసీ కొత్త చీఫ్ ఆయనేనా గౌడ్ సాబ్ కి పార్టీ పగ్గాలు ఇచ్చిన కాంగ్రెస్

TPCC president : టీపీసీసీ కొత్త చీఫ్ ఆయనేనా.. గౌడ్ సాబ్ కి పార్టీ పగ్గాలు ఇచ్చిన కాంగ్రెస్..!

తెలంగాణాలోనే కాదు ఈసారి కేంద్రంలో కూడా కాంగ్రెస్ బలంగా కనిపించింది. ఐతే రాష్ట్ర రాజకీయాల్లో క్రీయాశీలంగా ఉండేలా పీసీసీ చీఫ్ లను తయారు చేస్తుంది. ఈ క్రమంలో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్ ని తెలంగాణా చీఫ్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఐతే దీనిపై కాంగ్రెస్ ముఖ్య నాయకులు చెరో మాట చెప్పుకుంటున్నా బయటకు చెప్పలేని పరిస్థితి వారిదని తెలుస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది