Beers : భానుడి భగభగలతో ఎక్కువ మంది చల్లని పానీయాలపై ఫోకస్ చేస్తున్నారు. ఎండలో తిరిగిన వారు బాగా అలసిపోవడంతో చల్లని పాలనీయాలపై ప్రభావం చూపుతుంది. ఇక చల్లని బీర్లని తాగేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే బీర్లకి ఎక్కువ ఆదరణ లభిస్తుండడంతో మద్యం షాపులలో నో స్టాక్స్ లభిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు వైన్ షాపుల్లో కూల్ లైట్ బీర్లు లేవని బోర్డులే దర్శనం ఇస్తున్నాయి. ఇతర కంపెనీల బీర్లు దొరుకుతున్నా, కింగ్ ఫిషర్ లైట్ బీర్లు దొరకకపోవడంతో మందుబాబులు ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. మంచిర్యాల జిల్లాలో ఏకంగా తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తరుణ్ జిల్లా ఎక్సైజ్ అధికారులకు బీర్లు దొరకడం లేదంటూ ఫిర్యాదు చేశాడు.
తాగుబోతుల సంఘం అధ్యక్షుడు రాసిన లేఖ ఇలా ఉంది. “నా పేరు కొట్రంగి తరుణ్, తాను తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడినని పేర్కొన్నాడు. గత 18 రోజులలో రాష్ట్రానికి రూ.670 కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకురావడం చాలా ఆనందకరంగా ఉందని తెలిపాడు. కానీ కొద్ది రోజులుగా మంచిర్యాల జిల్లాలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు ఏ వైన్ షాప్లో గాని, బార్లలో గాని లభ్యం కావడం లేదని తెలిపాడు. ఎండ తీవ్రతలు ఎక్కువ అవుతున్న కొద్దీ ప్రజలకు ముఖ్యంగా యువకులకు పెద్దలకు దాహం తీర్చుకునేందుకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అని తమ దృష్టికి వచ్చిందని లేఖలో తెలిపాడు. ఈ జిల్లాలోనే కాదు కరీంనగర్, జగిత్యాల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్ వంటి జిల్లాల్లో కూడా కింగ్ ఫిషర్ లైట్ బీర్లు లభ్యం కావడం లేదు.
ఈ లైట్ బీర్లను తాగడం ద్వారా మత్తు తక్కువ సమయం ఉంటుంది ఆ తర్వాత తమ పనులను చేసుకోగలుగుతాము అంటూ వివరించాడు. స్ట్రాంగ్ బీర్లు తాగడం ద్వారా కడుపులో మంట, తీవ్రమైన తలనొప్పి, వాంతులు వంటివి వస్తున్నాయని తెలిపాడు. తమకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండడానికి చల్లటి కింగ్ ఫిషర్ బీర్లను జిల్లాలోని అన్ని వైన్ షాపులలో, బార్లలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోమని కోరాడు. కింగ్ ఫిషర్ లైట్ బీర్లు తాగే ప్రతి ఒక్కరి తరపున ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నాడు. తమకు సహకరించినట్లయితే రాష్ట్ర ఆదాయాన్ని మరింత రెట్టింపు చేయుటకు తమవంతు కృషి చేస్తామని తెలిపాడు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.