Sunstroke : వేసవిలో మనం ఎక్కువగా వింటున్న పేరు వడదెబ్బ. సమ్మర్‌లో ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ వడదెబ్బ కేసులు పెరుగుతుంటాయి. ఎండ వేడిమికి శరీరంలో ద్రవాలు తగ్గి డీహైడ్రేషన్ ముప్పు కూడా ఎక్కువే. ఇది చివరికి వడదెబ్బకు దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో అవయవాలు పనిచేయకపోవడం, మరణం కూడా సంభవించవచ్చు. ఈ సమ్మర్‌లో వడదెబ్బ మరణాల సంఖ్య క్రమంగా పెరగడం మనం చూస్తూనే ఉన్నాం.తీవ్రమైన ఎండల్లో తిరిగినప్పుడు శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి వేడిగా అనిపించే పరిస్థితిని వడదెబ్బ అంటారు. ఈ సందర్భంలో చెమట గ్రంధులు పనిచేయడం మానేస్తాయి. అంటే వడదెబ్బ తగిలితే శరీరం చెమట పట్టదు. ఫలితంగా శరీర ఉష్ణోగ్రత నియంత్రణలోకి రాదు.
వడదెబ్బలకి పలువురు మృత్యువాత పడుతుండడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జనాలు బయటకి రావాలంటే గజగజ వణికిపోతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలలో ఎండలు పెరిగిపోతున్న నేపథ్యంలో జనాలు పిట్టలలా ఎగిరిపోతున్నారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక్క రోజే సుమారు ఐదుగురు కన్ను మూశారు. ఏప్రిల్ 29న నల్గొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరులో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలానే సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరింత ఎండలు పెరిగిపోవడంతో ఐదుగురు కన్నుమూసారు.
ములుగు జిల్లా బూటారం గ్రామానికి చెందిన రామగిరి ప్రేమలీల(70), కుమురం భీం జిల్లా ఎల్కపల్లి గ్రామానికిచెందిన చౌధరి రవి(23), కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్‌లోని రెండో ప్లాట్‌ఫాంపై గుర్తుతెలియని వృద్ధుడు, శంషాబాద్‌లో భిక్షాటన చేస్తూ జీవించే 45 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి వడదెబ్బతో కన్నుమూసారు.అలానే నల్గొండ జిల్లా అజ్మాపురానికి చెందిన కౌషిక్(12) అనే బాలుడు కూడా వడదెబ్బతో కానరాని లోకాలకి వెళ్లారు. ఇప్పుడు వడదెబ్బతో కొందరు ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణలో రానున్న నాలుగు రోజులలో ఎండలు బాగా పెరిగే అవకాశం ఉంది. మే, 3 వరకు ఎండలు కొనసాగుతాయని అంటున్నారు. ప్రధానంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని సూచించింది వాతావరణ శాఖ
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.