Telangana : ప్రజలకు గుడ్ న్యూస్.. తులం బంగారం పథకంపై ప్రభుత్వం కీలక అప్డేట్.. అమలు అప్పటినుంచే..!

Authored By Sudheer Ramanujam | The Telugu News | Updated on : 7 April 2026, 3:00 pm
  •  Telangana : ప్రజలకు గుడ్ న్యూస్.. తులం బంగారం పథకంపై ప్రభుత్వం కీలక అప్డేట్.. అమలు అప్పటినుంచే..!

Telangana : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా నిలిచాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలను దశలవారీగా అమలు చేయాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతోంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ వంటి పథకాలను అమలు చేస్తూ ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పథకాలు ప్రజల జీవన విధానంపై ప్రభావం చూపుతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మహిళలు, రైతులు, మధ్యతరగతి కుటుంబాలకు ఇవి కొంత ఊరటనిచ్చాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Minister Sridhar Babu key announcement on the Tulam Gold Scheme

Minister Sridhar Babu key announcement on the Tulam Gold Scheme

Telangana : తులం బంగారం హామీపై ప్రతిపక్షాల విమర్శలు

అయితే కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో కొన్ని ఇంకా అమలులోకి రాకపోవడం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. ముఖ్యంగా కళ్యాణలక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఇవ్వాలన్న హామీ ఇంకా నెరవేరకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసే ప్రతి సందర్భంలో ఈ అంశాన్ని ప్రతిపక్షాలు ప్రస్తావిస్తూ ప్రశ్నిస్తున్నాయి. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఈ హామీ అమలు కాలేదని ఆరోపిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రజలను మోసం చేశారంటూ ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేస్తుండగా ప్రభుత్వం మాత్రం తమ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నామని సమాధానం ఇస్తోంది.

Telangana : మిగిలిన హామీల అమలుపై ప్రభుత్వ స్పష్టత

ఇక తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ విసిరిన సవాల్‌కు స్పందించిన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో చాలా భాగాన్ని ఇప్పటికే అమలు చేశామని మిగిలిన వాటిని కూడా త్వరలోనే అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా తులం బంగారం హామీని కూడా త్వరలో అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఐదేళ్ల పదవీకాలం ముగిసేలోపు అన్ని హామీలను పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను ఆయన ఖండిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. తమ ప్రభుత్వం వాస్తవికంగా అమలు చేయగలిగే పథకాలను మాత్రమే తీసుకువస్తుందని పేర్కొన్నారు. కొంత ఆలస్యం జరిగినప్పటికీ ఇచ్చిన ప్రతి హామీని 100 శాతం నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గం సమన్వయంతో పనిచేస్తోందని అంతర్గత విభేదాల ప్రచారం అసత్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయని విమర్శించారు. ఇకపోతే తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమలు రాజకీయ చర్చలకు కేంద్రబిందువుగా మారగా రాబోయే కాలంలో ఈ హామీల పూర్తి అమలు ప్రభుత్వానికి కీలక పరీక్షగా మారనుంది.

Advertisement

Sudheer Ramanujam

Sudheer Ramanujam Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి