TV5 Murthy : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో venu swamy వేణు స్వామి-మూర్తి ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది.గత కొద్ది రోజులుగా సెలబ్రిటీల జోస్యాలు చెబుతూ వారి ఫేమ్‌ని దిగజార్చే ప్రయత్నం చేశారు వేణు స్వామి. రీసెంట్‌గా నాగ చైతన్య- శోభితల జోస్యం కూడా చెప్పారు. అయితే అడ్డదిడ్డమైన జోస్యాలతో అడ్డగోలుగా మాట్లాడుతూ ఇతరులను నాశనం చేసి తాను సంపాదించుకుంటున్న వేణు స్వామికి జర్నలిస్ట్ మూర్తి గట్టిగానే ఇచ్చిపడేసాడు. దాంతో మూర్తి ఏదో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని భార్యతో సహా కలిసి వీడియో పెట్టేశారు. ఆత్మహత్య అనే బెదిరింపుల సిట్యూయేషన్ కూడా కలిపారు. మూర్తి ఐదు కోట్లు అడుగుతున్నారని ఆ దంపతులు చెప్పుకొచ్చారు.
మూర్తి 2017 నుంచి మాపై చెడు ప్రసారం చేస్తున్నాడని అన్నారు. 8 నెలలుగా వేధింపులు మరీ ఎక్కువయ్యాయని కూడా వేణు స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. గత 8 నెలలో 15 కేజీల బరులు తగ్గిపోయానంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు వేణు స్వామీ సతీమణి సైతం.. 5 కోట్లంటే మాటలా.. తమ బంగారం అంతా అమ్మిన కూడా అంత ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉందని కూడా ఎమోషనల్ అయ్యారు. ఆ డబ్బుల్ని మేం ఇవ్వలేం. మమ్మల్ని ఎలాగైన చంపేస్తారంటూ కూడా సంచలన వీడయో విడుదల చేశారు. నా చావు వెస్ట్ కావొద్దు.ఒక వేళ..నేను ఆత్మహత్య చేసుకుంటే.. వేణు స్వామి మీద అలిగేషన్స్ వల్ల ఆయన సతీమణి చనిపోయిందని అంటారు. ఇది ఇన్ డైరెక్ట్ గా మర్డర్ అని కూడా శ్రీవాణి అన్నారు. తమ వల్ల కొంత మంది అయిన.. ఇలాంటి దురాగతాల నుంచి బైటపడతారని ఈ వీడియో చేస్తున్నట్లు వేణు స్వామిదంపతులు చెప్పారు.
ఇక వేణు స్వామి వీడియోపై మూర్తి స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. అసలు వేణు స్వామి తల పైన ఐదు రూపాయలు కూడా రావని.. అలాంటి వ్యక్తిని ఐదు కోట్ల రూపాయలు నేను ఎలా అడుగుతానని కూడా ప్రశ్నించారు. మిమ్మల్ని వేధిస్తున్న ఆ గ్యాంగును నేనే పట్టుకుంటానని కూడా చెప్పారు. అప్పటివరకు వేణు స్వామి దంపతులు భయపడకుండా ఉండాలని కోరారు. ఆత్మహత్య అస్సలు చేసుకోకూడదని పేర్కొన్నారు.30 ఏళ్ల కెరీర్‌లో ఎవరి దగ్గర నేను రూపాయి తీసుకుంది లేదు. జీతం విషయంలో కాస్త ఎక్కువ తక్కువ కావాలని అడుగుతా కాని. ఎవరిని బెదిరించను.నేను రూ.5 కోట్లు అడిగినట్టు తేలిస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపండి. నేను చనిపోయాక అయిన దోషిగా తేలితే నా ఎముకలకి మూర్తి ద్రోహి అని బోర్డ్ తగిలించండి. ఎన్డీ తివారి వంటి హైప్రొఫైల్ కేసులోనే నేను డబ్బులకి లొంగలేదు, ఇప్పుడు మిమ్మల్ని ఐదు కోట్లు డిమాండ్ చేస్తానా అంటూ మూర్తి ప్రశ్నించారు. వీళ్ల మీద షో ఆపకుంటే నా మీద క్షుద్ర పూజలు చేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు, అప్పుడు నా వెంట్రుక పీకి వాళ్ళ చేతిలో పెట్టాను. నేను మూడ్రోజుల కింద షో చేస్తే వేణు స్వామి 8 నెలల నుంచి 15 కేజీలు ఎలా తగ్గాడు అంటూ మూర్తి ప్రశ్నించాడు.
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్‌సి అన్నారు.…
Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే…
Hyderabad Air Quality : ఇన్నాళ్లు ఢిల్లీలో వాయి కాలుష్యం ఎక్కువ అని వినేవాళ్లం. కాని ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా…
Devi Sri Prasad : పుష్ప2 మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్‌కి నిర్మాతలకి గొడవలు జరిగినట్టు అనేక వార్తలు…
Groom Chase : అచ్చం సినిమాలో జరిగిన చేజ్ సీన్ విధంగా బయట ఓ సంఘటన జరిగింది. విలన్ పారిపోతుంటే…
Allu Arjun Pushpa 2 Kissik Song : ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా పుష్న2…
Kangana Ranaut : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ఘోర పరాజయం తర్వాత, బాలీవుడ్ నటి, బిజెపి…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం మరి కొద్ది రోజులలో…
This website uses cookies.