TV5 Murthy : వేణు స్వామి దంప‌తుల ఆరోప‌ణ‌ల‌పై మూర్తి స్పంద‌న‌.. నన్ను రాళ్ల‌తో కొట్టి చంపండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TV5 Murthy : వేణు స్వామి దంప‌తుల ఆరోప‌ణ‌ల‌పై మూర్తి స్పంద‌న‌.. నన్ను రాళ్ల‌తో కొట్టి చంపండి..!

 Authored By ramu | The Telugu News | Updated on :20 August 2024,10:05 am

ప్రధానాంశాలు:

  •  TV5 Murthy : వేణు స్వామి దంప‌తుల ఆరోప‌ణ‌ల‌పై మూర్తి స్పంద‌న‌.. నన్ను రాళ్ల‌తో కొట్టి చంపండి..!

TV5 Murthy : ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల‌లో venu swamy వేణు స్వామి-మూర్తి ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది.గ‌త కొద్ది రోజులుగా సెల‌బ్రిటీల జోస్యాలు చెబుతూ వారి ఫేమ్‌ని దిగ‌జార్చే ప్ర‌య‌త్నం చేశారు వేణు స్వామి. రీసెంట్‌గా నాగ చైత‌న్య‌- శోభిత‌ల జోస్యం కూడా చెప్పారు. అయితే అడ్డదిడ్డమైన జోస్యాలతో అడ్డగోలుగా మాట్లాడుతూ ఇతరులను నాశనం చేసి తాను సంపాదించుకుంటున్న వేణు స్వామికి జర్నలిస్ట్ మూర్తి గ‌ట్టిగానే ఇచ్చిప‌డేసాడు. దాంతో మూర్తి ఏదో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని భార్యతో సహా కలిసి వీడియో పెట్టేశారు. ఆత్మహత్య అనే బెదిరింపుల సిట్యూయేషన్ కూడా కలిపారు. మూర్తి ఐదు కోట్లు అడుగుతున్నారని ఆ దంపతులు చెప్పుకొచ్చారు.

TV5 Murthy మూర్తి కూల్ వార్నింగ్..

మూర్తి 2017 నుంచి మాపై చెడు ప్రసారం చేస్తున్నాడని అన్నారు. 8 నెలలుగా వేధింపులు మరీ ఎక్కువయ్యాయని కూడా వేణు స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. గత 8 నెలలో 15 కేజీల బరులు తగ్గిపోయానంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు వేణు స్వామీ సతీమణి సైతం.. 5 కోట్లంటే మాటలా.. తమ బంగారం అంతా అమ్మిన కూడా అంత ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉందని కూడా ఎమోషనల్ అయ్యారు. ఆ డబ్బుల్ని మేం ఇవ్వలేం. మమ్మల్ని ఎలాగైన చంపేస్తారంటూ కూడా సంచలన వీడయో విడుదల చేశారు. నా చావు వెస్ట్ కావొద్దు.ఒక వేళ..నేను ఆత్మహత్య చేసుకుంటే.. వేణు స్వామి మీద అలిగేషన్స్ వల్ల ఆయన సతీమణి చనిపోయిందని అంటారు. ఇది ఇన్ డైరెక్ట్ గా మర్డర్ అని కూడా శ్రీవాణి అన్నారు. తమ వల్ల కొంత మంది అయిన.. ఇలాంటి దురాగతాల నుంచి బైటపడతారని ఈ వీడియో చేస్తున్నట్లు వేణు స్వామిదంపతులు చెప్పారు.

TV5 Murthy వేణు స్వామి దంప‌తుల ఆరోప‌ణ‌ల‌పై మూర్తి స్పంద‌న‌ నన్ను రాళ్ల‌తో కొట్టి చంపండి

TV5 Murthy : వేణు స్వామి దంప‌తుల ఆరోప‌ణ‌ల‌పై మూర్తి స్పంద‌న‌.. నన్ను రాళ్ల‌తో కొట్టి చంపండి..!

ఇక వేణు స్వామి వీడియోపై మూర్తి స్పందిస్తూ ఓ వీడియో విడుద‌ల చేశారు. అసలు వేణు స్వామి తల పైన ఐదు రూపాయలు కూడా రావని.. అలాంటి వ్యక్తిని ఐదు కోట్ల రూపాయలు నేను ఎలా అడుగుతానని కూడా ప్రశ్నించారు. మిమ్మల్ని వేధిస్తున్న ఆ గ్యాంగును నేనే పట్టుకుంటానని కూడా చెప్పారు. అప్పటివరకు వేణు స్వామి దంపతులు భయపడకుండా ఉండాలని కోరారు. ఆత్మహత్య అస్సలు చేసుకోకూడదని పేర్కొన్నారు.30 ఏళ్ల కెరీర్‌లో ఎవ‌రి ద‌గ్గ‌ర నేను రూపాయి తీసుకుంది లేదు. జీతం విష‌యంలో కాస్త ఎక్కువ త‌క్కువ కావాల‌ని అడుగుతా కాని. ఎవ‌రిని బెదిరించ‌ను.నేను రూ.5 కోట్లు అడిగిన‌ట్టు తేలిస్తే నన్ను రాళ్ల‌తో కొట్టి చంపండి. నేను చనిపోయాక అయిన దోషిగా తేలితే నా ఎముక‌ల‌కి మూర్తి ద్రోహి అని బోర్డ్ త‌గిలించండి. ఎన్డీ తివారి వంటి హైప్రొఫైల్ కేసులోనే నేను డ‌బ్బుల‌కి లొంగ‌లేదు, ఇప్పుడు మిమ్మ‌ల్ని ఐదు కోట్లు డిమాండ్ చేస్తానా అంటూ మూర్తి ప్ర‌శ్నించారు. వీళ్ల మీద షో ఆపకుంటే నా మీద క్షుద్ర పూజలు చేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు, అప్పుడు నా వెంట్రుక పీకి వాళ్ళ చేతిలో పెట్టాను. నేను మూడ్రోజుల కింద షో చేస్తే వేణు స్వామి 8 నెలల నుంచి 15 కేజీలు ఎలా తగ్గాడు అంటూ మూర్తి ప్ర‌శ్నించాడు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది