
Nagarjuna : నాగార్జునకి ఇంత ఝలక్ ఇచ్చారేంటి.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత
Nagarjuna : హైదరాబాద్‌లో గత కొన్నిరోజులుగా అక్రమ కట్టడాల మీద హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) స్పెషల్ ఫోకస్ పెట్టడం మనం చూశాం.మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్‌కన్వెన్షన్ హాల్‌ను నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం పత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణం పైనా ఫిర్యాుదుల వచ్చాయి. ఎన్ కన్వెన్షన్ ను తాకుతూనే చెరువు నీళ్లు ఉంటాయి. దీంతో, ఈ నిర్మాణం కు సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు సేకరించింది. ఈ రోజు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు ప్రారంభించింది. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేతను ప్రారంభించింది.
నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై ఫిర్యాదు అందింది. తమ్మిడి చెరువును ఆక్రమించి మూడు ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నాగార్జున నిర్మించారని ఫిర్యాదు వచ్చింది. దీంతో విచారణ నిర్వహించిన అధికారులు అది ఆక్రమిత స్థలంగా తేల్చుకుని పక్కా ఆధారాలతో శనివారం తెల్లవారుజాము నుంచే కూల్చివేతకు ఉపక్రమించారు. తమ్మకుంటలో చెరువును ఆక్రమించి మూడు ఎకరాల్లో సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని జనం కోసం అనే సంస్థ హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేస్తూ పక్కా అధారాలు సమర్పించిన నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు చేపట్టారు.
Nagarjuna : నాగార్జునకి ఇంత ఝలక్ ఇచ్చారేంటి.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత
హైదరాబాద్ లో గత కొద్ది రోజులుగా హైడ్రా అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక చర్యలు చేపట్టింది. అక్రమ కట్టడాలు గుర్తించి వెంటనే కూల్చి వేస్తోంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్ కు చెందినది భావిస్తున్న జవ్వాడ ఫామ్ హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేతకు అధికారులు రంగం సిద్దం అవ్వగా, దానికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. సెలబ్రిటీలు, ప్రముఖుల అక్రమ నిర్మాణాలను సైతం హైడ్రా కూల్చివేతకు రంగం చేస్తుండటం హాట్ టాపిక్ అయ్యింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.