Nara Lokesh : నా అన్న పవన్ కళ్యాణ్ మా తల్లితో అదే చెప్పారు.. కలిసి వస్తున్నాం నువ్వు గెలవాలంటే మీ అబ్బ దిగి రావాలి.. నారా లోకేష్ మాస్ వార్నింగ్
Nara Lokesh : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబునాయుడు అరెస్ట్ గురించే చర్చ. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన జైలులోనే ఉన్నారు. జైలులో ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ సీఎం అని కూడా చూడకుండా కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని, చివరకు స్నానానికి వేడి నీళ్లు కూడా ఇవ్వడం లేదని నారా లోకేష్ మండిపడ్డారు. చంద్రబాబును పరామర్శించడం కోసం నందమూరి కుటుంబ సభ్యులు కూడా కదిలారు.
బాలకృష్ణతో పాటు చాలామంది కుటుంబ సభ్యులు అందరూ చంద్రబాబును పరామర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నారా లోకేష్, బాలకృష్ణతో కలిసి చంద్రబాబును జైలులో పరామర్శించి ధైర్యం చెప్పి వచ్చారు. అయితే.. జైలులో చంద్రబాబు భద్రతపై అనేక అనుమానాలు లేవనెత్తుతున్నారు టీడీపీ నేతలు. నారా లోకేష్ కూడా అనుమానం వ్యక్తం చేశారు. బాలకృష్ణ గారు నేను జైలు లోపలికి వెళ్లినప్పుడు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ లోపలికి వచ్చి మరీ మా ఫోటోలు తీస్తున్నారు. ఏ పోలీసు కూడా స్పందించడం లేదు. మా కళ్ల ముందే ఇదంతా జరుగుతుంటే బాబు గారి భద్రతపై అనుమానం కాక ఇంకేం వస్తుంది అంటూ నారా లోకేష్ మండిపడ్డారు.చంద్రబాబు రాష్ట్ర ప్రజల తరుపున పోరాడినందుకే శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. నన్ను వ్యక్తిగతంగా దూషించారు. బ్రాహ్మణి పైన కూడా అనేక పోస్టులు పెట్టారు. ప్రజల తరుపున పోరాటం చేస్తున్నందుకు మాకిదంతా. మాకు ఇది అవసరమా? ప్రజల కోసం పోరాడుతుంటే అడుగడుగునా అవమానించారు. ఈరోజు పవన్ కళ్యాణ్ పైన కూడా చేస్తున్నారు.
Nara Lokesh : ప్రజల కోసం పోరాడితే మా తల్లిని అవమానిస్తారా?
ఆయన కుటుంబ సభ్యులను కూడా లాగుతున్నారు. ఒక సైకో చేసే పనులు ఇవి. ఆయనకు వ్యతిరేకంగా పోరాడేవారికి స్లో చేయాలనుకుంటే వాళ్ల కుటుంబ సభ్యుల మీద పడితే స్లో అవుతారని అనుకుంటున్నారు. ఈరోజు అన్న గారు పవన్ కళ్యాణ్ అమ్మ గారికి ఒక మాట చెప్పారు. శాసనసభ సాక్షిగా మిమ్మల్ని ఆనాడు అవమానిస్తే నేను చాలా బాధపడ్డాను. మళ్లీ మీ ముఖంలో నవ్వు కనబడేలా కలిసికట్టుగా పని చేస్తాం అని పవన్ కళ్యాణ్ మాటిచ్చారని నారా లోకేష్ చెప్పుకొచ్చారు.