New Ration Cards : కొత్త రేష‌న్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారా.. బిగ్ అప్డేట్ ఇచ్చిన తెలంగాణ ప్ర‌భుత్వం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

New Ration Cards : కొత్త రేష‌న్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారా.. బిగ్ అప్డేట్ ఇచ్చిన తెలంగాణ ప్ర‌భుత్వం

 Authored By ramu | The Telugu News | Updated on :23 December 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  New Ration Cards : కొత్త రేష‌న్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారా.. బిగ్ అప్డేట్ ఇచ్చిన తెలంగాణ ప్ర‌భుత్వం

New Ration Cards : తెలంగాణ ప్ర‌భుత్వం పేద‌ల‌కి అనేక శుభవార్త‌లు చెబుతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన పేదలకు కొత్త రేషన్‌ కార్డులను అందించేందుకు సంక్రాంతి నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు పౌరసరఫరాల శాఖ సన్నద్ధం అవుతోంది . గతంలో ఉన్న మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులు చేయనున్నట్లు సమాచారం. ఆదాయ పరిమితిని కొంత పెంచాలని అధికారులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. పాత మార్గదర్శకాలలో గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితి రూ.1.50 లక్షలుగా ఉంటే పట్టణాల్లో రూ.2 లక్షలుగా ప్రస్తుతం ఈ మొత్తాన్ని కొంత పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తంది.

New Ration Cards కొత్త రేష‌న్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారా బిగ్ అప్డేట్ ఇచ్చిన తెలంగాణ ప్ర‌భుత్వం

New Ration Cards : కొత్త రేష‌న్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారా.. బిగ్ అప్డేట్ ఇచ్చిన తెలంగాణ ప్ర‌భుత్వం

New Ration Cards వారికి శుభ‌వార్త‌..

గతంలో ఉన్న విధంగా కాకుండా ఆదాయ పరిమితి కొంత పెంచాలని అధికారులు ప్రతిపాదించనున్నట్లు తెలిసింది. గతంలో రేషన్ కార్డుల మంజూరుకు ఆదాయ పరిమితి.. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు కాగా.. పట్టణాలు, నగరాల్లో రూ.2 లక్షలుగా ఉంది. ఈ మొత్తాన్ని కొంత పెంచాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న వార్షిక ఆదాయ పరిమితిని రూ.10-20 వేల వరకు పెంచే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. ఈ వారంలోపే రాష్ట్ర క్యాబినెట్‌ భేటీ కానున్నట్లు తెలిసింది. ఈలోగానే తాజా మార్గదర్శకాలను ఖరారుచేయనున్నారు.ఇప్పటికే కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయించుకునేందుకు వచ్చిన దరఖాస్తుల్లో ప్రతిపాదిత లబ్ధిదారులు 26 లక్షలుగా ఉన్నారు.

ప్రభుత్వం జనవరిలో నిర్వహించిన ప్రజా పాలనలోమ భాగంగా కొత్త రేషన్‌కార్డుల డిమాండ్‌పై ఆలోచన చేశారు. సుమారు 10 లక్షల పైచిలుకు వచ్చిన దరఖాస్తుల్లో లబ్ధిదారుల సంఖ్య 32 లక్షలుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి ఇచ్చినట్లయితే మొత్తం రేషన్‌ లబ్ధిదారుల సంఖ్య 3.4 కోట్లకు చేరుతుంది రాష్ట్ర జనాభా 3.80 కోట్లు అని అధికారులు వెల్లడించారు. కొత్త కార్డుల జారీ పైన మంత్రివర్గ సమావేశంలో చర్చించి అధికారికంగా ఆదాయ పరిమితి .. అర్హతలు, మార్గదర్శకాలు ప్రకటించనున్నారు. అదే విధంగా కొత్త జంటలకూ రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించి.. ఆ వెంటనే మంజూరు చేసేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తోంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది