Medaram Jatara 2026 : మేడారం జాతరలో కొత్త ట్రెండ్ : చలిని క్యాష్ చేసుకుంటున్న వేడి నీళ్ల బిజినెస్!
ప్రధానాంశాలు:
Medaram Jatara 2026 : మేడారం జాతరలో కొత్త ట్రెండ్ : చలిని క్యాష్ చేసుకుంటున్న వేడి నీళ్ల బిజినెస్!
Medaram Jatara 2026 : మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన ఈ మహోత్సవం ప్రతి రెండేళ్లకోసారి వైభవంగా నిర్వహించబడుతుంది. దేశం నలుమూలల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ జాతరను ‘దక్షిణ భారత కుంభమేళా’గా పిలుస్తారు. గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క–సారలమ్మలకు అంకితమైన ఈ ఉత్సవం వారి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ ఏడాది మేడారం జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులు గద్దెలపై కొలువుదీరనుండగా, 29న చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెలకు చేరుకుంటారు.
Medaram Jatara 2026 : మేడారం జాతరలో కొత్త ట్రెండ్ : చలిని క్యాష్ చేసుకుంటున్న వేడి నీళ్ల బిజినెస్!
Medaram Jatara 2026 : ఇదో రకం బిజినెస్..
30న భక్తులు పెద్ద సంఖ్యలో మొక్కులు చెల్లించుకోనున్నారు. 31న అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగియనుంది. ముఖ్యంగా జనవరి 30న సమ్మక్క–సారలమ్మలతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజుల వనప్రవేశం జాతరలో ప్రధాన ఘట్టంగా నిలుస్తుంది. ఇప్పటికే మేడారం పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా తండోపతండాలుగా భక్తులు అమ్మవార్ల దర్శనానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పూజా సామగ్రి, కొబ్బరికాయలు, బెల్లం వంటి వస్తువుల అమ్మకాలకు అధికారులు టెండర్ల ద్వారా ఏర్పాట్లు చేశారు. అయితే భక్తుల అవసరాలను గమనించిన కొందరు కొత్త తరహా వ్యాపారాలను మొదలుపెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో జంపన్న వాగులో స్నానానికి భక్తులు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిని అవకాశంగా మలుచుకున్న కొందరు వ్యక్తులు అక్కడ వేడి నీళ్లను విక్రయించడం ప్రారంభించారు. ఒక్క బకెట్ వేడి నీటిని రూ.50కు అమ్ముతూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. చలిలో చల్లని నీటితో స్నానం చేయలేని భక్తులు వేడి నీటిని కొనుగోలు చేసి స్నానం చేస్తున్నారు.ఈ వేడి నీళ్ల బిజినెస్ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు దీనిని ‘అవసరమే అవకాశంగా మారింది’ అంటూ ప్రశంసిస్తుంటే, మరికొందరు భక్తుల అవసరాలను వాణిజ్యంగా మలుస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా మేడారం జాతరలో భక్తి, సంప్రదాయాలతో పాటు ఇలాంటి కొత్త ట్రెండ్స్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.Medaram Jatara 2026 , Sammakka Saralamma Jatara 2026, Medaram Jatara Latest News, Medaram Jatara New Trend , Medaram Tribal Festival 2026, మేడారం జాతర 2026 , మెదారం సమ్మక్క సారలమ్మ జాతర, మేడారం జాతర తాజా వార్తలు, మేడారం జాతరలో కొత్త ట్రెండ్, మేడారం జాతర బిజినెస్, సమ్మక్క సారలమ్మ జాతర విశేషాలు,..