Crime News : కోడలు వండిన కూర బాగలేదన్న అత్త… భర్తకు ఫిర్యాదు చేయడంతో తల్లిని ఏం చేశాడో తెలిస్తే నివ్వెరపోతారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Crime News : కోడలు వండిన కూర బాగలేదన్న అత్త… భర్తకు ఫిర్యాదు చేయడంతో తల్లిని ఏం చేశాడో తెలిస్తే నివ్వెరపోతారు

 Authored By kranthi | The Telugu News | Updated on :15 January 2023,8:30 am

Crime News : ఈరోజుల్లో నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎవ్వరినీ నమ్మేటట్టు లేదు. చివరకు సొంత కుటుంబ సభ్యులను కూడా ఏదైనా చేయడానికి వెనకాడటం లేదు జనాలు. సొంత వాళ్లు, లేని వాళ్లు అనేది లేకుండా స్వార్థం కోసం ఏదైనా చేస్తున్నారు. అందుకే దీన్ని కలికాలం అంటున్నాం. తాజాగా తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.. అత్తాకోడళ్ల పంచాయితీ కాస్త తల్లీకొడుకుల వైపు మళ్లింది. అత్తాకోడళ్ల మధ్య గొడవలు ఉండటం సహజమే కానీ.. ఆ గొడవ యూటర్న్ తీసుకోవడంతో తల్లీకొడుకుల మధ్య గొడవ పెరిగి పెద్దది అయి చివరకు ఏమైందో తెలుసా?

son attacked his mother after having dispute with his wife in mahabubabad

son attacked his mother after having dispute with his wife in mahabubabad

ఈ ఘటన జిల్లాలోని వేంనూరు గ్రామంలో చోటు చేసుకుంది. మహేందర్, నందిని అనే దంపతులు తన తల్లి బుజ్జితో కలిసి నివసిస్తున్నారు. అయితే.. నందిని, బుజ్జికి అస్సలు పడదు. ఇద్దరూ అత్తాకోడళ్లు కావడంతో ఇద్దరి మధ్య చాలా గొడవలు వస్తూ ఉంటాయి. తాజాగా నందిని వండిన కూర బాగోలేదని బుజ్జి చెప్పింది. తనను మందలించింది కూడా. దీంతో వెంటనే భర్త మహేందర్ కు ఫిర్యాదు చేసింది నందిని. మీ అమ్మ నేను వండిన కూర బాగోలేదని తిట్టింది అంటూ భర్త ముందు బావురుమంది.

Crime News : నా భార్య వండిన కూరనే బాగోలేదంటావా? అంటూ తల్లిపై విరుచుకుపడిన భర్త

నా భార్య వండిన కూరనే బాగోలేదంటావా? అంటూ తన తల్లిపై మహేందర్ విరుచుకుపడ్డాడు. మటన్ కొట్టే కత్తితో తన తల్లిపై దాడి చేశాడు. దీంతో బుజ్జికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను గమనించిన స్థానికులు వెంటనే మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత బుజ్జి బంధువులకు ఈ విషయం తెలిసి మహేందర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది