Palla Rajeshwar Reddy : పొన్నాల లక్ష్మయ్య ఎఫెక్ట్.. హస్తం గూటికి పల్లా రాజేశ్వర్ రెడ్డి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Palla Rajeshwar Reddy : పొన్నాల లక్ష్మయ్య ఎఫెక్ట్.. హస్తం గూటికి పల్లా రాజేశ్వర్ రెడ్డి?

 Authored By kranthi | The Telugu News | Updated on :16 October 2023,10:00 am

Palla Rajeshwar Reddy : తెలంగాణలో ఎన్నికల సమరం మొదలైంది. ఈనేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ఇదే కరెక్ట్ సమయం అనుకొని కొందరు నేతలు పార్టీలు మారుతున్నారు. తమకు టికెట్ దక్కదు అని అనుకుంటే వెంటనే పార్టీ నుంచి బయటికి వచ్చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే.. ఆయన బీఆర్ఎస్ లో చేరుతారనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆయన బీఆర్ఎస్ లో చేరితే జనగామ టికెట్ ఆయనకు ఇస్తారనే వార్తలు వస్తున్నాయి. ఆయనకు బీఆర్ఎస్ టికెట్ ఇస్తే.. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి టికెట్ కన్ఫమ్ అయిన పల్లా పరిస్థితి ఏంటి? పల్లాను పక్కన పెట్టి బీఆర్ఎస్ టికెట్ పొన్నాలకు ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

తనకు పార్టీలో అవమానం జరిగిందని, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించడానికి ముందే కాంగ్రెస్ పార్టీని వీడారు పొన్నాల. అలాగే.. ఆయనకు కాంగ్రెస్ టికెట్ కూడా దక్కదనే కోపంతోనే పార్టీ నుంచి బయటికి వచ్చారు. కానీ.. బీఆర్ఎస్ లో ఇంకా చేరలేదు. ఒకవేళ బీఆర్ఎస్ లో చేరితే బీఆర్ఎస్ పార్టీ తరుపున జనగామ టికెట్ ఆయనకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సీనియర్ నేత, జనగామలో ఎంతో బలం ఉన్న నేత, బీసీ నేత కావడంతో బీఆర్ఎస్ తరుపున పొన్నాలకు టికెట్ ఇచ్చేందుకే సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.

palla rajeshwar reddy to join in congress

Palla Rajeshwar Reddy : పల్లా పరిస్థితి ఏంటి?

పల్లా రాజేశ్వర్ రెడ్డికి బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకపోతే ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరితే పల్లా రాజేశ్వర్ రెడ్డికి జనగామ టికెట్ ఇచ్చేందుకు హైకమాండ్ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పొన్నాలను పార్టీలో చేర్చుకొని బీఆర్ఎస్ నుంచి జనగామ తరుపున టికెట్ ఇచ్చి రేవంత్ రెడ్డికి షాక్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది