Patnam Mahender Reddy : అప్పుడు రేవంత్‌ను ఓడించి.. ఇప్పుడు కాంగ్రెస్‌లోకి పట్నం..? రాయకీయం అంటే ఇదే కదా..!
Patnam Mahender Reddy : పట్నం మహేందర్ రెడ్డి తెలుసు కదా. 2014 లో టీఆర్ఎస్ గెలిచినప్పుడు మంత్రి అయ్యారు. కానీ.. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో మాత్రం పట్నం మహేందర్ రెడ్డి గెలవలేకపోయారు. దీంతో ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండాల్సిన పరిస్థితి. అయితే.. 2018 ఎన్నికల గురించి మరోసారి మాట్లాడుకోవాలి. ఎందుకంటే.. 2018 ఎన్నికల్లో కీలకమైన కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన రేవంత్ రెడ్డిని ఓడించేందుకు టీఆర్ఎస్ చాలా ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే.. పట్నం నరేందర్ రెడ్డిని బరిలోకి దించారు. అక్కడ రేవంత్ ను ఓడించడం కోసం మహేందర్ రెడ్డి కూడా వ్యూహాలు రచించారు.
చివరకు.. రేవంత్ రెడ్డిని 9 వేల ఓట్ల తేడాతో ఓడించి.. కేసీఆర్ ముందు మార్కులు సంపాదించుకున్న నేతల్లో మహేందర్ రెడ్డి కూడా ఒకరు. కానీ.. అప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు పార్టీలో లేవు. మహేందర్ రెడ్డికి, సీఎం కేసీఆర్ కి మధ్య గ్యాప్ వచ్చింది. అసలు బీఆర్ఎస్ పార్టీ అధికార కార్యక్రమాలకు కూడా మహేందర్ రెడ్డి అటెండ్ కావడం లేదు. అసలు కేసీఆర్ తనను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు మహేందర్ రెడ్డి. పట్నం నరేందర్ రెడ్డి ఎవరో కాదు. ఆయన బంధువే. అయితే.. నిన్నటి వరకు రేవంత్ రెడ్డిపై కారాలు, మిరియాలు నూరారు.. ఈ పట్నం బ్రదర్స్. ఇప్పుడు ఏకంగా ప్లేట్ మార్చి.. కాంగ్రెస్ లో చేరేందుకు వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.
Patnam Mahender Reddy : రేవంత్ వీళ్లను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తారా?
రేవంత్ రెడ్డిని ఓడించిన నరేందర్ రెడ్డిని, వ్యూహాలు పన్నిన మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అసలు రేవంత్ తో ఉన్న విభేదాలను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వీళ్లు రెడీగానే ఉన్నారు. కానీ.. రేవంత్ ఒప్పుకుంటారా? ప్రస్తుతం తాండూరు టికెట్ కోసం ప్రస్తుతం మహేందర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కానీ.. తాండూరు టికెట్ తనకు ఇచ్చేలా లేదు బీఆర్ఎస్ అధిష్ఠానం. ఈనేపథ్యంలో కాంగ్రెస్ లో చేరి.. తాండూరు నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేయాలని మహేందర్ రెడ్డి ప్లాన్. చూద్దాం మరి ఏం జరుగుతుందో?