Pension : ఏపీలో పెరిగిన పెన్షన్స్.. తెలంగాణలో పెరిగేది ఎప్పుడంటూ రేవంత్ రెడ్డిపై ఫైర్
ప్రధానాంశాలు:
Pension : ఏపీలో పెరిగిన పెన్షన్స్.. తెలంగాణలో పెరిగేది ఎప్పుడంటూ రేవంత్ రెడ్డిపై ఫైర్
Pension : ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు చంద్రబాబు నాయుడు. అధికారికంగా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు వరుసపెట్టి శుభవార్తలు చెబుతున్నారు. అధికారం చేపట్టగానే తొలి సంతకాన్ని మెగా డీఎస్సీపై చేసిన చంద్రబాబు.. ఆపై పెన్షన్స్ తీసుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న పెన్షన్ విధానంలో మార్పులు తీసుకొస్తూ పెన్షన్లను భారీగా పెంచేశారు. ఈ మేరకు ఫైల్ పై సంతకం కూడా చేశారు బాబు.2014 -2019 మధ్య టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పేరుతో ఈ పథకాన్ని అమలు చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా మార్చేసింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం పేరును ఎన్టీఆర్ భరోసాగా మార్చింది.
Pension ఇంకెప్పుడు అంటూ ఫైర్..
వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రస్తుతం రూ.3వేల పెన్షన్ వస్తుండగా.. దాన్ని 4 వేల రూపాయలకు పెంచారు. పెంచిన పెన్షన్ మొత్తాన్ని ఏప్రిల్ నుంచే అమలు చేస్తున్నారు. అంటే ఏప్రిల్, మే, జూన్‌కు సంబంధించి నెలకు రూ.1000 చొప్పున 3 నెలలకు 3 వేలు అదనంగా కూడా ఇవ్వబోతున్నారు. మరి తెలంగాణలో పెన్షన్ల ఎప్పుడు పెంచుతారని ప్రజలు అడుగుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే 44 లక్షల మంది పింఛనుదారులు ఉండగా.. కొత్త పింఛన్ల కోసం తాజాగా 24.84 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, వారికి మోక్షం ఎప్పుడు కలుగుతుందా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా గమనిస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హమీల్లో భాగంగా సాధారణ పింఛను రూ.4,000, దివ్యాంగులకు రూ.6,000 ఇస్తామని చెప్పారు. అయితే ఇంత వరకు పెన్షన్ పెంచకపోవడంతో లబోదిబోమంటున్నారు.
ఏపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెన్షన్ పెంచడంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై కూడా ఒత్తిడి ఎక్కువైంది. త్వరలోనే పెంపు కార్యక్రమం చేపట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇక పెన్షన్ తీసుకుంటున్న వారిలో 70 నుంచి 75 ఏళ్లు పైబడిన వారికి బేసిక్ పెన్షన్ పై 15 శాతం అదనంగా ఇవ్వనున్నారు. అలానే 75 నుంచి 80 ఏళ్ల లోపు వారికి 20శాతంగా నిర్ణయించారు. అదే విధంగా 80 నుంచి 85 ఏళ్ల లోపు వారికి 30శాతం, 90 నుంచి 95 ఏళ్ల లోపు వారికి 50శాతం అదనంగా పెన్షన్ అందించనున్నారు. ఇక 95 నుంచి 100 ఏళ్ల లోపు వారికి 60శాతం, 100ఏళ్లకు పైబడిన పెన్షనర్లకు, కుటుంబ పెన్షన్దారులకు 100శాతం అదనంగా పెన్షన్ ఇవ్వనుదని సమాచారం