Pet Dog : చాలా దారుణం.. ఐదు నెలల పసికందుని పీక్కుతిన్న పెంపుడు కుక్క..!
Pet Dog : ఇటీవలి కాలంలో కుక్కల వలన ఎలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయో మనం చూస్తూ ఉన్నాం. కొంచెం అజాగ్రత్తగా ఉంటే చాలు కుక్కలు పసి పిల్లల ప్రాణాలు తీస్తున్నాయి. హైదరాబాద్‌లోను ఇలాంటి దారుణాలు ఎన్నో జరగడం మనం చూశాం. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఆడుకుంటున్న ఓ 5 నెలల పసికందును పెంపుడు కుక్క పీక్కుతుండడం ఉలిక్కిపడేలా చేసింది.. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దత్తు, లావణ్య దంపతులు.
Pet Dog కుక్కలతో జాగ్రత్త
వీరికి ఐదు నెలల సాయి ఏకైక సంతానం. ఈ దంపతులు తాండూరు మండలం గౌతాపూర్ గ్రామ పంచాయతి పరిధి బసవేశ్వర నగర్‌లో నాగభూషణం అనే వ్యాపారికి చెందిన నాపరాయి పాలిషింగ్ యూనిట్‌లో పనిచేస్తున్నారు. వీళ్లు ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉన్నట్టుంది ఆ కుక్క చిన్నోడిపై విరుచుకుపడింది. ముఖంపై రక్తంకారేలా దారుణంగా కొరికేసింది. ఈ కుక్క దత్తు కుమారుడు సాయినాథ్(5 నెలలు)పై దాడి చేసి చంపింది. దాంతో ఆగకుండగ ఆ పసికందును కండ కండలు పీక్కుతిన్నది. దీంతో బిడ్డను కోల్పోయామన్న బాధలో దత్తు అతని భార్య కలిసి పెంపుడు కుక్కపై దాడి చేసి చంపారు. సాయినాథ్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
చనిపోయిన బిడ్డను గుండెలకు హత్తుకుని రోదించిన తీరు అందర్నీ కంటతడి పెట్టించింది. రోజువారీగా దత్తు పాలిష్ యూనిట్లో నాపరాయి కట్ చేస్తుండగా.. అతడికి దాహం వేయడంతో భార్యను నీళ్లు తీసుకు రమ్మని చెప్పాడు.పసికందును తన ఒళ్లో నుంచి ఇంట్లో పడుకోబెట్టిన లావణ్య భర్తకు నీరు అందించడానికి వెళ్ళింది. ఇంతలో అక్కడే ఉన్న పెంపుడు కుక్క ఇంట్లోకి చొరబడి నేలపై ఆడుకుంటున్న ఐదు నెలల పసికందును అతి క్రూరంగా కొరికింది. తల, మెడ భాగంలో కొరికి పీక్కుతుంది. ఈ ఘటనలో పసికందు తీవ్రంగా గాయపడ్డాడు. రక్తపు మడుగులో ఉన్న కుమారుడిని చూసి అందరు శొకసంద్రంలో మునిగారు. అయితే భర్త సాయంతో వెంటనే బాలుడిని స్థానిక ఆసుపత్రికి తరలించింది. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ చిన్నారి అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. కోపోద్రికులైన కుటుంబ సభ్యులు ఆ పెంపుడు కుక్కను కొట్టి చంపేశారు.