Phone Tapping Case : ఫోన్ టాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు రాబోతున్నాయా..?
Phone Tapping Case : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మొదట చిన్న ఉదంతంలా కనిపించినా, ఇప్పుడది పెద్ద స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. నిఘా విభాగం మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు విచారణకు హాజరైన తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్యాపింగ్ టార్గెట్اలో ప్రత్యర్థులే అని భావించినా, ఇప్పుడు స్వంత పార్టీ నేతలతో పాటు వారి సన్నిహితుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని తెలుస్తుంది.
Phone Tapping Case : ఫోన్ టాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు రాబోతున్నాయా..?
కేవలం రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లు, వ్యాపార సంబంధిత ఉద్యోగుల ఫోన్లపైనా నిఘా పెట్టినట్లు తాజా సమాచారం వెల్లడిస్తోంది. ఈటల రాజేందర్ భార్య, బంధువులు, జమ్ము కశ్మీర్ మాజీ డీజీపీ గోపాల్ రెడ్డి ఫోన్‌లు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన సంస్థల ఉద్యోగులపై నిఘా పెట్టినట్లు గుర్తించారు. మొత్తం 4013 నంబర్లపై 2023 నవంబర్ 15 నుంచి 30 మధ్య నిఘా జరిగిందన్న నివేదిక ఇప్పుడు కలకలం రేపుతోంది.
బీఆర్ఎస్ మాజీ నేతలతో పాటు పద్మా దేవేందర్ రెడ్డి, తాటికొండ రాజయ్య, మర్రి జనార్ధన్ రావు లాంటి స్వంత పార్టీ నేతలపై కూడా ట్యాపింగ్ జరిగినట్లు వెల్లడవుతోంది. ఇదే సమయంలో ఐఏఎస్ అధికారులు గౌతమ్, రొనాల్డ్ రాస్ లు కూడా ట్యాపింగ్ జాబితాలో ఉండటం సంచలనంగా మారింది. అసలు ఈ వ్యవహారం ప్రభాకర్ రావు నిర్ణయంతో జరిగిందా లేక ఎవరైనా బలమైన ఆదేశాలతో చేశారా? అనే ప్రశ్నకు వచ్చే సమాధానం బీఆర్ఎస్ కీలక నేతల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
This website uses cookies.