Phone Tapping Case : ఫోన్ టాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు రాబోతున్నాయా..?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 26 June 2025, 5:00 pm
  •  బిఆర్ఎస్ నేతలకు ఫోన్ టాపింగ్ కేసు.. పెద్ద తలనొప్పిగా మారిందా..?

  •  కాంగ్రెస్ సర్కార్ ఫోన్ టాపింగ్ కేసును వదిలేలా లేదు..!!

  •  Phone Tapping Case : ఫోన్ టాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు రాబోతున్నాయా..?

Phone Tapping Case  : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మొదట చిన్న ఉదంతంలా కనిపించినా, ఇప్పుడది పెద్ద స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. నిఘా విభాగం మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు విచారణకు హాజరైన తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్యాపింగ్‌ టార్గెట్‌اలో ప్రత్యర్థులే అని భావించినా, ఇప్పుడు స్వంత పార్టీ నేతలతో పాటు వారి సన్నిహితుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని తెలుస్తుంది.

Phone Tapping Case : ఫోన్ టాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు రాబోతున్నాయా..?

Phone Tapping Case : ఫోన్ టాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు రాబోతున్నాయా..?

Phone Tapping Case  : ఫోన్ టాపింగ్ కేసు అగ్ర నేతలకు చిక్కుముడి కాబోతుందా..?

కేవలం రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లు, వ్యాపార సంబంధిత ఉద్యోగుల ఫోన్లపైనా నిఘా పెట్టినట్లు తాజా సమాచారం వెల్లడిస్తోంది. ఈటల రాజేందర్ భార్య, బంధువులు, జమ్ము కశ్మీర్ మాజీ డీజీపీ గోపాల్ రెడ్డి ఫోన్‌లు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన సంస్థల ఉద్యోగులపై నిఘా పెట్టినట్లు గుర్తించారు. మొత్తం 4013 నంబర్లపై 2023 నవంబర్ 15 నుంచి 30 మధ్య నిఘా జరిగిందన్న నివేదిక ఇప్పుడు కలకలం రేపుతోంది.

బీఆర్ఎస్ మాజీ నేతలతో పాటు పద్మా దేవేందర్ రెడ్డి, తాటికొండ రాజయ్య, మర్రి జనార్ధన్ రావు లాంటి స్వంత పార్టీ నేతలపై కూడా ట్యాపింగ్ జరిగినట్లు వెల్లడవుతోంది. ఇదే సమయంలో ఐఏఎస్ అధికారులు గౌతమ్, రొనాల్డ్ రాస్ లు కూడా ట్యాపింగ్ జాబితాలో ఉండటం సంచలనంగా మారింది. అసలు ఈ వ్యవహారం ప్రభాకర్ రావు నిర్ణయంతో జరిగిందా లేక ఎవరైనా బలమైన ఆదేశాలతో చేశారా? అనే ప్రశ్నకు వచ్చే సమాధానం బీఆర్ఎస్ కీలక నేతల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp