Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల విషయంలో రేవంత్ గుడ్ న్యూస్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల విషయంలో రేవంత్ గుడ్ న్యూస్..!

 Authored By ramu | The Telugu News | Updated on :15 April 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల విషయంలో రేవంత్ గుడ్ న్యూస్..!

Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర Telangana Govt ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రెండో విడతIndiramma Housing Scheme  ప్రారంభించేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Revanth reddy మంగళవారం నుంచి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. మొత్తం 23 రోజులపాటు ఈ పథకానికి సంబంధించిన కార్యాచరణ కొనసాగనుంది. ప్రతి నియోజకవర్గానికి ఓ ప్రత్యేక అధికారిని, అలాగే ప్రతి మండలంలోని నాలుగు లేదా ఐదు గ్రామాలకు గెజిటెడ్ అధికారిని నియమించనున్నారు. వారు అర్హుల జాబితాలను పరిశీలించి, అనర్హుల వివరాలను తొలగించే బాధ్యత వహించనున్నారు.

Indiramma Housing Scheme ఇందిరమ్మ ఇళ్ల విషయంలో రేవంత్ గుడ్ న్యూస్

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల విషయంలో రేవంత్ గుడ్ న్యూస్..!

Indiramma Housing Scheme : ఇక ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఆ సందేహం అవసరం లేదు.. ఎందుకంటే !

ఇందిరమ్మ ఇళ్లను కేవలం అర్హులకే అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందిరమ్మ కమిటీలు అర్హుల ఎంపికకు సూచనలు చేస్తాయి. ఈ నెల 17వ తేదీ వరకు ప్రజాప్రతినిధుల సూచనలతో గ్రామాలకు ఇళ్ల మంజూరుపై చర్చలు జరుగుతాయి. ఆ తర్వాత 18 నుంచి 21 వరకు కమిటీల సూచనలను అధికారుల పరిధిలో సమీక్షిస్తారు. అనంతరం 22 నుండి 30 వరకు అధికారులతో ‘సూపర్ చెక్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. మే 1న అర్హుల జాబితా పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు.

జాబితాల పరిశీలన అనంతరం మే 5, 6, 7 తేదీల్లో జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా ఇళ్ల మంజూరు ప్రక్రియ జరగనుంది. మరోవైపు గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పలు ప్రాంతాల్లో ఇంకా లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో, ఈ అంశంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే నిర్మాణం పూర్తైన ఇళ్లు ఎల్‌2 దరఖాస్తుదారులకు మాత్రమే కేటాయించనున్నట్లు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో, ఇళ్ల కేటాయింపుపై గల సందేహాలకు స్పష్టత వచ్చింది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది