
Maha News Channel : మహా న్యూస్ ఛానల్ పై దాడిని ఖండించిన చంద్రబాబు , పవన్ , రేవంత్, కేటీఆర్
Maha News Channel : హైదరాబాద్‌లోని మహా న్యూస్ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంశంపై ప్రసారించిన కథనాల్లో BRS నేత కేటీఆర్ పేరును ప్రస్తావించడమే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. కార్యకర్తలు కార్యాలయంలోకి చొరబడి అద్దాలు, ఫర్నిచర్, స్టూడియో పరికరాలను ధ్వంసం చేయడమే కాకుండా, బయట పార్క్ చేసి ఉంచిన వాహనాలపై రాళ్లు విసిరారు. కొంతమందిని గాయపరిచినట్టు సమాచారం. ఈ ఘటన పట్ల మానవ హక్కుల సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు , జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నారు…
Maha News Channel : మహా న్యూస్ ఛానల్ పై దాడిని ఖండించిన చంద్రబాబు , పవన్ , రేవంత్, కేటీఆర్
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. “ఇది ప్రజాస్వామ్యంపై చేసిన దాడి”గా అభివర్ణించిన ఆయన, మీడియా సంస్థలపై భౌతిక దాడులకు ఎలాంటి స్థానమూ లేదని స్పష్టం చేశారు. మీడియా స్వేచ్ఛను రక్షించడం ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైందని, బెదిరింపులు, బలవంతపు చర్యల ద్వారా ఆ స్వేచ్ఛను అణగదొక్కే యత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఘటనను తీవ్రంగా ఖండించారు. “మీడియా కథనాలపై అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధ మార్గాలు ఉన్నాయి. కానీ దాడులకు దిగడం గర్హనీయమైన చర్య” అని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదే విషయంపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. దాడిని ఖండించిన ఆయన, బాధ్యత వహించినవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మీడియా తన పాత్రను బాధ్యతగా నిర్వహిస్తుందని, కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడాన్ని సమర్థించలేమన్నారు. BRS వర్గాలు సంయమనం పాటించాలని సూచిస్తూ, కేటీఆర్ కూడా ట్వీట్‌లో “భౌతిక దాడులకు తావు లేదు, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి” అంటూ పరోక్షంగా కార్యకర్తలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే సందర్భంగా బీజేపీ నేత బండి సంజయ్ సైతం ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. రాజకీయ భిన్నాభిప్రాయాల పేరుతో మీడియా గొంతు నొక్కే చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా నిలుస్తాయని నేతలు స్పష్టం చేశారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.