Maha News Channel : మహా న్యూస్ ఛానల్ పై దాడిని ఖండించిన చంద్రబాబు , పవన్ , రేవంత్‌,  కేటీఆర్ 

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 28 June 2025, 8:00 pm
  •  మహా న్యూస్ ఛానల్ పై దాడిని ఖండించిన రాజకీయ ప్రముఖులు

  •  Maha News Channel : మహా న్యూస్ ఛానల్ పై దాడిని ఖండించిన చంద్రబాబు , పవన్ , రేవంత్‌,  కేటీఆర్ 

Maha News Channel : హైదరాబాద్‌లోని మహా న్యూస్‌ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంశంపై ప్రసారించిన కథనాల్లో BRS నేత కేటీఆర్ పేరును ప్రస్తావించడమే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. కార్యకర్తలు కార్యాలయంలోకి చొరబడి అద్దాలు, ఫర్నిచర్, స్టూడియో పరికరాలను ధ్వంసం చేయడమే కాకుండా, బయట పార్క్ చేసి ఉంచిన వాహనాలపై రాళ్లు విసిరారు. కొంతమందిని గాయపరిచినట్టు సమాచారం. ఈ ఘటన పట్ల మానవ హక్కుల సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు , జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నారు…

Maha News Channel : మహా న్యూస్ ఛానల్ పై దాడిని ఖండించిన చంద్రబాబు , పవన్ , రేవంత్‌,  కేటీఆర్ 

Maha News Channel : మహా న్యూస్ ఛానల్ పై దాడిని ఖండించిన చంద్రబాబు , పవన్ , రేవంత్‌,  కేటీఆర్

Maha News Channel : మహా న్యూస్ ఛానల్ పై దాడిని ఖండించిన రాజకీయ ప్రముఖులు

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. “ఇది ప్రజాస్వామ్యంపై చేసిన దాడి”గా అభివర్ణించిన ఆయన, మీడియా సంస్థలపై భౌతిక దాడులకు ఎలాంటి స్థానమూ లేదని స్పష్టం చేశారు. మీడియా స్వేచ్ఛను రక్షించడం ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైందని, బెదిరింపులు, బలవంతపు చర్యల ద్వారా ఆ స్వేచ్ఛను అణగదొక్కే యత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఘటనను తీవ్రంగా ఖండించారు. “మీడియా కథనాలపై అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధ మార్గాలు ఉన్నాయి. కానీ దాడులకు దిగడం గర్హనీయమైన చర్య” అని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదే విషయంపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. దాడిని ఖండించిన ఆయన, బాధ్యత వహించినవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మీడియా తన పాత్రను బాధ్యతగా నిర్వహిస్తుందని, కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడాన్ని సమర్థించలేమన్నారు. BRS వర్గాలు సంయమనం పాటించాలని సూచిస్తూ, కేటీఆర్‌ కూడా ట్వీట్‌లో “భౌతిక దాడులకు తావు లేదు, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి” అంటూ పరోక్షంగా కార్యకర్తలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే సందర్భంగా బీజేపీ నేత బండి సంజయ్ సైతం ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. రాజకీయ భిన్నాభిప్రాయాల పేరుతో మీడియా గొంతు నొక్కే చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా నిలుస్తాయని నేతలు స్పష్టం చేశారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "New pensions : లబ్ధిదారులకు శుభవార్త .. ఆగస్టు 15 నుంచి 2.25 లక్షల మందికి కొత్త పింఛన్లు.. ఎవరికెవరికీ వస్తాయంటే?"

  2. "Rice price : ప్రజలకు గుడ్ న్యూస్.. ఆధార్ ఉంటే చాలు..తక్కువ ధరకే బియ్యం.. ఎక్కడ దొరుకుతుంది? ఎలా కొనాలి? వివరాలివే.."

  3. "Karthika Deepam 2 Today Episode August 04 : సూరజ్‌పై జ్యోత్స్న ఆగ్రహం.. పెళ్లి ఆపేందుకు కుటుంబంలో కొత్త డ్రామా!"

  4. "Gold Rate Today : బంగారం కొనేవారికి శుభవార్త.. ఆగస్టు 4న 22, 24 క్యారెట్ల తాజా రేట్లు ఇవే!"

  5. "Viagra Benefits : క్యాన్సర్‌పై వయాగ్రా ప్రభావం? ..ఇజ్రాయెల్ పరిశోధనలో ఆసక్తికర విషయాలు.. ?"

  6. "Fruit Sticker: పండ్లపై ఉన్న స్టిక్కర్ అర్థం తెలుసా? .. 4, 8, 9 ఈ కోడ్ తెలియకపోతే మోసపోయే అవకాశం!"

  7. "Astrology : శని అనుగ్రహంతో ఈ 2 రాశుల వారికి భారీ అదృష్టం.. వచ్చే 3 ఏళ్లు శుభయోగమేనా?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp