Praja Palana Application Forms : ప్రజా పాలన అభయ హస్తం దరఖాస్తు ఫామ్‌లను అమ్ముకుంటున్న దళారులు.. వీడియో వైరల్
ప్రధానాంశాలు:
అప్లికేషన్ ఫామ్ ల కోసం గొడవ పడుతున్న జనం
అమ్ముకుంటున్న దళారులు
పట్టించుకోని అధికారులు
Praja Palana Application Forms : కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకోవడం కోసం ఇవాళ్టి నుంచి అంటే డిసెంబర్ 28 నుంచి అవకాశం ఇచ్చింది. దాని కోసం ప్రజా పాలన దరఖాస్తు ఫామ్ ను ఉచితంగా అందిస్తోంది. అధికారులు గ్రామాల్లో ఉచితంగా ఈ ఫామ్ లను అందిస్తున్నారు. అయితే.. దళారులు మాత్రం దీన్ని ఆసరాగా చేసుకొని ఫామ్స్ ను అమ్ముకుంటున్నారు. ఒక్కో ఫామ్ ను 50 నుంచి 100 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఉదయం నుంచి లైన్ లో నిలుచున్నా కొందరికి ఫామ్స్ దొరకడం లేదు. కానీ.. దళారులు మాత్రం ఆఫీసుల బయట అమ్ముకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభయ హస్తం స్కీమ్ ను తీసుకొచ్చింది. తెలంగాణ ప్రజలను ఆదుకోవడం కోసం, వాళ్లకు మంచి చేయడం కోసం ఈ స్కీమ్ ను తీసుకొస్తే.. ప్రభుత్వాన్ని బ్యాడ్ చేయడం కోసం, కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా కొందరు దళారులు వ్యవహరిస్తున్నారు.
ప్రతి కౌంటర్ వద్ద దళారులు ఉంటున్నారు. ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న అప్లికేషన్ ఫామ్స్ లను దళారులు, జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు.. డబ్బులకు అమ్ముకుంటున్నారు. ప్రజలు ఎలాగైనా కొంటారు అని పెద్ద ఎత్తున అమ్మకాలకు తెర లేపారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పట్టించుకునే వాళ్లు లేకపోవడంతో పేద ప్రజలు తప్పని సరి పరిస్థితుల్లో రూ.100 ఇచ్చి ఫామ్ లను కొంటున్నారు. అధికారులు కూడా సరిగ్గా స్పందించకపోవడం వల్ల అప్లికేషన్ ఫామ్ ఎలాగైనా నింపాలి కాబట్టి డబ్బులకు కొనుక్కొని ఫామ్ ను నింపుతున్నారు ప్రజలు.
ప్రజా పాలనలో అభయ హస్తం అప్లికేషన్స్ అమ్ముకుంటున్న దళారులు
అభయ హస్తం అప్లికేషన్ ఫామ్ లను కొందరు దళారులు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 50 నుంచి 100 రూపాయలకు అమ్ముతున్నారు.
ప్రతి కౌంటర్ వద్ద ఇలా జరుగుతుంది
పట్టించుకునే వారు లేకపోవడంత పేద ప్రజలు తప్పదని కొంటున్నారు.ప్రభుత్వం… pic.twitter.com/wOJ3v7v26A
— Telugu Scribe (@TeluguScribe) December 28, 2023
ప్రజాపాలన దగ్గర అప్లికేషన్ ఫాంల కోసం గొడవ పడ్తున్న జనం pic.twitter.com/Fm7qgHugEa
— Telugu Scribe (@TeluguScribe) December 28, 2023