Praja Palana Application : ఆరు గ్యారెంటీలపై కొత్త అప్డేట్ … మీ దరఖాస్తు అప్రూవ్ అయిందా లేక రిజెక్ట్ అయిందా ఇలా చెక్ చేసుకోండి..!
ప్రధానాంశాలు:
Praja Palana Application : ఆరు గ్యారెంటీలపై కొత్త అప్డేట్ ... మీ దరఖాస్తు అప్రూవ్ అయిందా లేక రిజెక్ట్ అయిందా ఇలా చెక్ చేసుకోండి..!
Praja Palana Application : తెలంగాణ ప్రభుత్వం అభయ హస్తం పేరుతో ఆరు గ్యారంటీలకు అర్హులను ఎంపిక చేసేందుకు ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 తేదీ వరకు ప్రజల వద్ద నుంచి 6 గ్యారంటీల దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించింది. పల్లె పల్లెనా అన్ని పట్టణాలలో విజయవంతంగా ప్రజా పాలన పూర్తి చేసింది. అయితే దీనికి సంబంధించి కొత్త అప్డేట్ ఒకటి ఇప్పుడు అందరికీ ఉపయోగపడుతుంది. https://prajapalana.telangana.gov.in/Applicationstatus వెబ్సైట్లో ఆరు గ్యారెంటీల కోసం అభయ హస్తం పథకం కింద దరఖాస్తులు ఇచ్చిన వారంతా తమకు ప్రజాపాలన కార్యక్రమంలో ఇచ్చిన రసీదు పత్రంలోని దరఖాస్తు నెంబర్ ను ఎంటర్ చేసి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది.
అలాగే వ్యూ స్టేటస్ పై క్లిక్ చేయాలి. వెంటనే అప్లై చేసుకున్న దరఖాస్తు అప్రూవ్ అయిందా లేక రిజెక్ట్ అయిందా అనే విషయం తెలిసిపోతుంది. ప్రభుత్వం పాలన మొదలుపెట్టిన తర్వాత మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారు. మిగిలిన ఐదు పథకాలు కూడా తప్పకుండా అమలు చేస్తామని ఇప్పటికే వాగ్దానం చేయడం జరిగింది. ఇందుకోసం ప్రభుత్వం 100 రోజుల గడువు కోరింది. ఈ 6 గ్యారంటీల పథకాల అప్లికేషన్స్ పరిశీలించడానికి నెలరోజుల సమయం పడుతుంది. ఈ నెల రోజుల్లో ప్రభుత్వ తరపు సిబ్బంది నేరుగా ఎంక్వయిరీ చేసి అర్హులను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల లిస్టులో చేర్చనుంది.
ఇంకా దరఖాస్తు చేసుకొని వారు స్థానిక ఎమ్మార్వో ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రజా పాలన ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఒక కోటి అప్లికేషన్స్ వచ్చినట్లుగా ఆయన తెలిపారు. ఈ ఆరు గ్యారంటీలకు ఎవరు లబ్ధిదారులో ఎంక్వయిరీ చేసి ప్రభుత్వం వారికి పథకాలను అందించనుంది. దీనికోసం నెల సమయం పడుతుందని తెలిపింది. కాగా ఆరు గ్యారంటీలపై కొత్త అప్డేట్ వచ్చింది. ప్రత్యేక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు అప్రూవ్ అయిందా లేక రిజెక్ట్ అయిందా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.