Revanth Reddy : రేవంత్‌రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు.. త్వరలో రాహుల్ తో భేటీ..?
Revanth reddy : దేశంలో బీజేపీకి ఇప్పుడిప్పుడే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలో బలోపేతమై, బీజేపీ కి ధీటుగా ముందుకు సాగితే దానికి పట్టం కట్టటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే మాటలు వినిపిస్తున్నాయి, కానీ కాంగ్రెస్ వాలకం చూస్తుంటే పాత కాలపు కంపుతో నానాటికి తీసికట్టుగా మారిపోతుంది.
దేశ వ్యాప్తంగా ఆ పార్టీకి ఉన్న క్రేజ్ తగ్గిపోతుంది. వాస్తవానికి కాంగ్రెస్ లో పోరాటం చేయగలిగిన నేతలు అనేక మంది ఉన్నారు, కానీ అక్కడ జరిగే రాజకీయాల మూలంగా వాళ్ళ వాయిస్ వినిపించే అవకాశం లేకుండా పోతుంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలం ఉన్నకాని సరైన నేతను గుర్తించి ప్రోత్సహించే విషయంలో పార్టీ హైకామెంట్ వెనకడుగు వేయటంతో ఆయా రాష్ట్రాల్లో పార్టీ తీవ్రంగా నష్టపోతోంది.
Revanth reddy : రాహుల్ తో భేటీ రేవంత్ కారణాలు
తెలంగాణ విషయానికే వస్తే రేవంత్ రెడ్డి లాంటి బలమైన నేత పార్టీ భవిష్యత్తు కోసం సీరియస్ గా ఫైట్ చేయటానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఇక్కడ సీనియర్స్ మాత్రం అతన్ని అడుగడుగునా తొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి విషయంలో రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు బలమైన నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ లో కాంగ్రెస్ కు పూర్వవైభవం వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్న మాట.
ఇలాంటి లోపాలను సరిచేయడానికి రాహుల్ గాంధీ పూనుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి లాంటి నేతలను రాహుల్ స్వయంగా కలిసి చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం తమిళనాడు లో ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ఇందులో పాల్గొనటానికి రాహుల్ గాంధీ రాబోతున్నాడు. ఆ ప్రచారం ముగిసిన వెంటనే హైదరాబాద్ వచ్చి, గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలతో సమావేశం కాబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి తో రాహుల్ మంతనాలు సాగించే అవకాశం ఉంది. అదే సమయంలో పీసీసీ చీఫ్ పదవి గురించి కూడా సృష్టమైన హామీ ఇవ్వచ్చని తెలుస్తుంది.