Rahul Sipliganj : తెలంగాణ రాజకీయాల్లోకి సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ నుండి పోటీ..?
Rahul Sipliganj : తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అందరికీ సుపరిచితుడే. బిగ్ బాస్ సీజన్ త్రీలో పోటీపడి విన్నర్ గా నిలవడం జరిగింది. అంతకుముందు పాటలతో తర్వాత బిగ్ బాస్ షోలో.. పోటీపడి మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత సినిమా రంగంలో అనేక అవకాశాలు అందుకోవటం జరిగింది. కృష్ణ వంశీ దర్శకత్వంలో “రంగమార్తాండ” సినిమాలో కూడా నటించాడు. అంతేకాదు “RRR” సినిమాలో “నాటు నాటు” పాటతో ఒక్కసారిగా తన తలరాత మార్చేసుకున్నాడు. ఈ పాట పాడి హాలీవుడ్ దాకా తన పాపులారిటీ విస్తరించుకున్నాడు.
ఆస్కార్ అవార్డు వేదికపై ఈ పాట పాడి అందరి దృష్టిని రాహుల్ సిప్లిగంజ్ ఆకర్షించాడు. అయితే ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మరి కొద్ది నెలలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీల నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రాహుల్ సిప్లిగంజ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. 95వ ఆస్కార్ అవార్డు వేడుకలలో రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ వేదికపై కాలభైరవతో కలిసి పాట పాడారు. ఈ ఘనత సాధించటంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి… రాహుల్ సిప్లిగంజ్ నీ ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.
దీంతో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాహుల్ సిప్లిగంజ్ చేత పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. దీంతో రాహుల్ సిప్లిగంజ్… పొలిటికల్ ఎంట్రీ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.