Ration Card : రేషన్ కార్డులో భారీగా పేర్ల తొలగింపు.. అందులో మీరు ఉన్నారా చూసుకోండి..?
ప్రధానాంశాలు:
Ration Card : రేషన్ కార్డులో భారీగా పేర్ల తొలగింపు.. అందులో మీరు ఉన్నారా చూసుకోండి..?
Ration Card : రేషన్ కార్డ్ దారులందరు అలర్ట్ అయ్యే న్యూస్ ఒకటి వచ్చింది. రేషన్ కార్డ్ అనర్హుల గురించి ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ వేసింది. ఏకంగా వారిని రేషన్ కార్డుల నుంచి తొలగిస్తుంది. ఇంతకీ మీ పేరు మీ రేషన్ కార్డులో ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి. ఇప్పటికే ఉమ్మడి కరీం నగర్ లో అనర్హుల పేర్లు రేషన్ కార్డు నుంచి తొలగించే ప్రక్రియ జరుగుతుంది. మరణించిన వారితో పాటు వివాహం చేసుకుని వేరే ఇంటికి వెళ్లిన మహిళలు, ఒక ప్రాంతం విడిచి మరో ప్రాంతానికి వెళ్లిన వారి పేర్లు తొలగిస్తున్నారు. పౌర సరఫరాల శాఖ ఇప్పటికే ఇలాంటి వారికి రేషన్ ఇవ్వడం ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. రేషన్ డీలర్ల ద్వారా ఈ పరిశీలన జరుగుతుంది. ఇందులో అన్ర్హులను గుర్తించి వారికి రేషన్ అందకుండా ఆపేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని దుర్వినియోగం చేసుకునే వారిని అరికట్టాలని ప్రభుత్వం ఇలా చేస్తుంది. ప్రభుత్వం రేషన్ కార్డ్ రద్ధుకు సంబందించి ఆదేశాలు జారీ చేసింది.
Ration Card అక్టోబర్ నాటికి ఈ సంఖ్య తగ్గే అవకాశం..
కరీం నగర్ లో ఫిబ్రవరి 2023 నాటికి 978595 రేషన్ కార్డులు ఉన్నాయి. వారిలో 2813951 మంది లబ్దిదారులు ఉన్నారు. అక్టోబర్ నాటికి ఈ సంఖ్య తగ్గే అవకాశం ఉందని తెలుస్తుంది. అంటే 977409 రేషన్ కార్డులు ఉండగా 2809132 మంది లబ్దిదారులే ఉన్నారు. 9 నెలల వ్యవధిలో 1186 రేషన్ కార్డులు రద్దు చేశారు. 5819 మంది పేర్లు తొలగించబడ్డాయి.
రేషన్ కార్డ్ ఉన్న ప్రతి వ్యక్తి డిసెంబర్ 31 నాటికి తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంది. లేదంటే వారి పేర్లు రేషన్ కార్డ్ నుంచి తొలగిస్తారు. గడువు లోపు ఈ కే వైసీ చేయని వారి రేషన్ కార్డ్ రద్దయ్యే అవకాశం ఉంది. రేషన్ కార్డ్ కలిగిన వారు డీలర్ల ను సంప్రదించి వెంటనే ఈ కేవైసీ చేసుకోవాలి.