CM Revanth Reddy : ప్రమాణ స్వీకారం చేసి నాలుగు రోజులు కూడా కాలేదు.. అప్పుడే కుప్పకూలిపోతున్న రేవంత్ ప్రభుత్వం? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

CM Revanth Reddy : ప్రమాణ స్వీకారం చేసి నాలుగు రోజులు కూడా కాలేదు.. అప్పుడే కుప్పకూలిపోతున్న రేవంత్ ప్రభుత్వం?

CM Revanth Reddy : తెలంగాణలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే పలు సంస్కరణలకు తెర లేపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కావచ్చు.. ఇంకోటి కావచ్చు.. అన్నీ చకచకా చేసేస్తున్నారు రేవంత్ రెడ్డి. తన తొలి సంతకం అభయ హస్తం పథకం మీద పెట్టారు. ఆ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :11 December 2023,6:00 pm

ప్రధానాంశాలు:

  •  బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఈ మూడు పార్టీలు కలుస్తాయా?

  •  ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్ ను చేయడంపై బీజేపీ ఆగ్రహం

  •  రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజంగానే పడిపోనుందా?

CM Revanth Reddy : తెలంగాణలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే పలు సంస్కరణలకు తెర లేపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కావచ్చు.. ఇంకోటి కావచ్చు.. అన్నీ చకచకా చేసేస్తున్నారు రేవంత్ రెడ్డి. తన తొలి సంతకం అభయ హస్తం పథకం మీద పెట్టారు. ఆ తర్వాత దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం కల్పించారు. ఆ తర్వాత విద్యుత్ సంస్కరణలపై కూడా వెంటనే నడుం బిగించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే.. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు రోజులు కూడా కాలేదు కానీ.. అసలు నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చే 5 ఏళ్ల పాటు కుప్పకూలకుండా ఉండగలదా? అనేది ఇప్పుడు డౌట్ వస్తోంది. అయితే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలడానికి చాన్స్ లేదు. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

కాబట్టి 64 మంది ఎమ్మెల్యేలు అనేది మ్యాజిక్ ఫిగర్ కు పైనే. కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలాలంటే 5 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ ఇవ్వకున్నా చాలు.. కుప్పకూలే చాన్స్ ఉంది. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించాలంటే ఆ ఆలోచన చేయాల్సింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. బీఆర్ఎస్ కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ, ఎంఐఎం ఈ రెండు పార్టీలు మద్దతు ఇస్తే మరో 15 మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తుంది. అప్పుడు బీఆర్ఎస్ కౌంట్ 54 అవుతుంది. అంటే.. మరో ఆరుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు కావాలి. కొత్తగూడెం నుంచి గెలిచిన సీపీఐ ఎమ్మెల్యే మద్దతు ఇస్తే.. 5 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి వచ్చినా బీజేపీ, ఎంఐఎంతో కలిసి బీఆర్ఎస్ సులభంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. తుమ్మినా.. దగ్గినా కుప్పకూలిపోయేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని.. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలిపోయే చాన్స్ ఉందా అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది.

CM Revanth Reddy : బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలుస్తాయా?

బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు కలుస్తాయా? అసలు అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకోవడంపై బీజేపీ వ్యతిరేకత వ్యక్తం చేసింది. మరి.. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, ఎంఐఎంతో బీజేపీ ఎందుకు కలుస్తుంది. ఎంఐఎంకు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంత ప్రాధాన్యత ఇస్తున్నదో అర్థం కావడం లేదని బీజేపీ నేతలు అంటున్నారు. చూడాలి మరి.. తెలంగాణలో ఏం జరగబోతోందో భవిష్యత్తులో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది