Ration Card : రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్… రేవంత్ సర్కార్ 2 కీలక నిర్ణయాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ration Card : రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్… రేవంత్ సర్కార్ 2 కీలక నిర్ణయాలు..!

Ration Card  : రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. తాజాగా రేషన్ కార్డులపై రెండు కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇక ఈ రెండు కీలక నిర్ణయాల వలన చాలామందికి లబ్ధి చేకూరుతుందని అని చెప్పాలి. ఇంతకీ ప్రభుత్వం రేషన్ కార్డు పై ఎలాంటి నిర్ణయాలు తీసుకువచ్చింది..?దీనివలన ఎవరికి ప్రయోజనం కలుగుతుంది అనే అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ […]

 Authored By tech | The Telugu News | Updated on :10 March 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Ration Card : రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్... రేవంత్ సర్కార్ 2 కీలక నిర్ణయాలు..!

Ration Card  : రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. తాజాగా రేషన్ కార్డులపై రెండు కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇక ఈ రెండు కీలక నిర్ణయాల వలన చాలామందికి లబ్ధి చేకూరుతుందని అని చెప్పాలి. ఇంతకీ ప్రభుత్వం రేషన్ కార్డు పై ఎలాంటి నిర్ణయాలు తీసుకువచ్చింది..?దీనివలన ఎవరికి ప్రయోజనం కలుగుతుంది అనే అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల పై రెండు కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. దీని కారణంగా ఉచిత కరెంటు లబ్ధిదారులకు కూడా బెనిఫిట్ కలగనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా రేషన్ కార్డు లేనివారికి కూడా ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. అయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఇప్పటికే పలు రకాల గ్యారెంటీలను అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ తాజాగా జీరో కరెంట్ బిల్లును కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే చాలామంది జీరో కరెంట్ బిల్లులను పొందుతున్నారు. ఇక అలాంటివారు కరెంట్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనిలో భాగంగానే 200 యూనిట్ల వరకు ఎంత బిల్లు వచ్చినా సరే ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.

అయితే కొంతమందికి మాత్రం ఇప్పటికీ కరెంటు బిల్లు వస్తూనే ఉంది. అంటే జీరో బిల్ రావడం లేదు. ఇక అలాంటి వారికి ఇప్పుడు ప్రభుత్వం గుడ్ న్యూస్ తీసుకువచ్చిందని చెప్పాలి. అయితే రేషన్ కార్డు కలిగి ఉండి కరెంట్ బిల్లు వచ్చిన కూడా చెల్లించాల్సిన పనిలేదని తాజాగా ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే ఇది కేవలం 200 యూనిట్ల మేర కరెంటు వాడుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది.అయితే వివరాలు సరిగా ఇవ్వకపోవడం వలన కొంతమందికి విద్యుత్ బిల్లులు జారీ అవుతున్నాయని కాబట్టి 200 యూనిట్లు కంటే తక్కువ విద్యుత్ వినియోగించిన సరే కరెంట్ బిల్లు వచ్చినట్లయితే అలాంటి వారు బిల్లు కట్టకుండా మండల పరిషత్ లేదా మున్సిపల్ విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లి రేషన్ ఆధార్ కార్డు కనెక్షన్ వివరాలతో మరోసారి దరఖాస్తు చేసుకున్నట్లయితే జీరో బిల్ జారీ అవుతుందని తెలియజేశారు.

కావున ఇప్పుడు మీకు కరెంట్ బిల్లు వచ్చిన సరే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు. ఇక రేషన్ కార్డులు లేని వారికి కూడా ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. అయితే ఈ నెల 12న తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న క్యాబినెట్ మీటింగ్ లో రేషన్ కార్డుల పై కీలక నిర్ణయం తీసుకొనున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త రేషన్ కార్డుల జారీ అంశంపై కీలక నిర్ణయాలు తీసుకొనున్నట్లు తెలుస్తోంది. కావున రేషన్ కార్డు లేనివారికి ఇది ఒక సానుకూల అంశం అని చెప్పవచ్చు. కాగా ప్రభుత్వం అందించే ప్రతి పథకానికి కూడా తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీని కారణంగా రేషన్ కార్డు లేని వారు చాలామంది ప్రభుత్వ స్కీమ్ లను పొందలేకపోతున్నారు. దీంతో కొత్త రేషన్ కార్డుల జారి పై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది