Revanth Reddy : కేసీఆర్ లక్కీ నంబర్ నా దగ్గర ఉంది.. నన్నేం చేయలేరన్న రేవంత్ రెడ్డి..!
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది. లోక్ సభ ఎన్నికలకు ముందు పార్టీ మారిన బీ ఆర్ ఎస్ నేతలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీ ఆర్ ఎస్ పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో హైకోర్ట్ లో కూడా ఫిర్యాదు చేశారు. ఐతే దీనిపై కోర్ట్ అసెంబ్లె సెక్రెటరీకి కీలక ఆదేశాలు […]
ప్రధానాంశాలు:
Revanth Reddy : కేసీఆర్ లక్కీ నంబర్ నా దగ్గర ఉంది.. నన్నేం చేయలేరన్న రేవంత్ రెడ్డి..!
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది. లోక్ సభ ఎన్నికలకు ముందు పార్టీ మారిన బీ ఆర్ ఎస్ నేతలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీ ఆర్ ఎస్ పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో హైకోర్ట్ లో కూడా ఫిర్యాదు చేశారు. ఐతే దీనిపై కోర్ట్ అసెంబ్లె సెక్రెటరీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్ నిర్ణయమే కీలకం అన్నట్టుగాకోర్ట్ చెప్పింది. అధికార కాంగ్రెస్ పార్టీ మారిన ఎమ్మెల్యేల మధ్య వార్ నడుస్తుంది. ఐతే ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఉప ఎన్నికల అశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy అనర్హత ప్రకటిస్తే ముందు సంతోషించేది మేమే..
తమకు ఏ ఆర్డర్ వచ్చినా మంచిదే అన్నారు రేవంత్ రెడ్డి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఏ ఆర్డర్ వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన అన్నారు. ఒకవేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినా ముందుగా సంతోషించేది తానేనని అన్నారు రేవంత్ రెడ్డి. ఢిల్లీలో తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరి మద్ధతు తెలిపాయని అన్నారు.బీ ఆర్ ఎస్, బీజేపీ నేతలు ఫిరాయింపులపై పోరాడుతున్నరని అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్కీ నంబర్ ఇప్పుడు తన దగ్గర ఉందని అన్నారు రేవంత్ రెడ్డి. 66 మంది ఎమ్మెల్యేల మద్ధతు తమకు ఉందని అన్నారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లు పాలించవద్దని బీజేపీ, బీ ఆర్ ఎస్ నేతలు కోరుతారని అన్నారు. కే టీ ఆర్ బై ఎలక్షన్స్ పేరుతో మైండ్ గేం ఆడుతున్నారని అన్నారు. పార్టీ ఫిరాయింపులే ఉండేవి కావని ఆయన అన్నారు.