Mynampally : మైనంపల్లి సీటు ఫిక్స్ చేసిన రేవంత్ రెడ్డి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mynampally : మైనంపల్లి సీటు ఫిక్స్ చేసిన రేవంత్ రెడ్డి?

Mynampally : తెలంగాణలో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇంకో రెండు మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. రాత్రికి రాత్రే రాజకీయాలు మారుతున్నాయి. ఏ నేత ఎప్పుడు ఏ పార్టీలో చేరుతారో అర్థం కావడం లేదు. అందుకే.. పార్టీలన్నీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. అయితే.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులను ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. దీంతో ఎమ్మెల్యే టికెట్ లభిస్తుందనే ఆశలో ఉన్న చాలామంది నేతలు నిరుత్సాహపడ్డారు. తమకు సీటు […]

 Authored By kranthi | The Telugu News | Updated on :29 August 2023,3:00 pm

Mynampally : తెలంగాణలో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇంకో రెండు మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. రాత్రికి రాత్రే రాజకీయాలు మారుతున్నాయి. ఏ నేత ఎప్పుడు ఏ పార్టీలో చేరుతారో అర్థం కావడం లేదు. అందుకే.. పార్టీలన్నీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. అయితే.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులను ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. దీంతో ఎమ్మెల్యే టికెట్ లభిస్తుందనే ఆశలో ఉన్న చాలామంది నేతలు నిరుత్సాహపడ్డారు. తమకు సీటు దక్కకపోవడంతో వేరే పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. చాలామంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకునే వాళ్లు దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ సూచించింది. ఇప్పటికే చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. ఇదంతా పక్కన పెడితే బీఆర్ఎస్ నుంచి మల్కాజిగిరి టికెట్ పొందిన మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మైనంపల్లి, మంత్రి హరీశ్ రావు మధ్య పొలిటికల్ వార్ సాగుతున్న విషయం తెలిసిందే. హరీశ్ రావుపై మైనంపల్లి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసినా మైనంపల్లికి టికెట్ మాత్రం ఇచ్చింది బీఆర్ఎస్ హైకమాండ్. కానీ.. తన కొడుకుకి మెదక్ సీటు కావాలని కూడా కోరారు. కానీ.. తన కొడుక్కి మాత్రం టికెట్ దక్కలేదు. అందుకే బీఆర్ఎస్ హైకమాండ్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్న మైనంపల్లి కాంగ్రెస్ లో పార్టీలో చేరబోతున్నారనే వార్తలు ప్రస్తుతం గుప్పుమంటున్నాయి.

revanth reddy fixed myanmpally seat in congress

Mynampally : మైనంపల్లి సీటు ఫిక్స్ చేసిన రేవంత్ రెడ్డి?

Mynampally : కర్ణాటకకు వెళ్లి డీకే శివకుమార్ ని కలిసి వచ్చిన మైనంపల్లి

ఈనేపథ్యంలోనే మైనంపల్లి ఇటీవలే కర్ణాటకలోని బెంగళూరు వెళ్లి అక్కడి సీనియర్ నేత డీకే శివకుమార్ ను కలిసి వచ్చినట్టు తెలుస్తోంది. శివకుమార్ కూడా మైనంపల్లి పార్టీ చేరికపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోనూ మైనంపల్లి మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే మైనంపల్లికి మల్కాజిగిరి నుంచి కాకుండా మేడ్చల్ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఆసక్తి చూపిస్తోందట. దానికి కారణం.. బీఆర్ఎస్ నుంచి మేడ్చల్ లో పోటీ చేస్తున్న మల్లారెడ్డిని ఢీకొట్టాలంటే ఖచ్చితంగా అది మైనంపల్లి వల్లనే అవుతుందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోందట. అలాగే.. మైనంపల్లి కొడుక్కి మెదక్ టికెట్ ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఓకే చెప్పడంతో ఇక కాంగ్రెస్ లో చేరేందుకు మంచి ముహూర్తం చూసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Tags :

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది