Mynampally : ఎమైనంపల్లి చెక్ పెట్టనున్న బీఆర్ఎస్ .. మల్కాజిగిరి కొత్త అభ్యర్థి ఇతడే..?
Mynampally : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వాడి వేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మరికొద్ది నెలలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈసారి గెలుపు కోసం ప్రధాన పార్టీలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీ మూడోసారి హ్యాట్రిక్ కొట్టడానికి అన్ని రకాలుగా రెడీ అవుతూ ఉంది. ఈ క్రమంలో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ ప్రకటించడం తెలిసిందే. మొత్తం 119 స్థానాలకు 115 మంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది.
ఇందులో సగానికి పైగా సిట్టింగ్ లకే కేసీఆర్ అవకాశం ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మల్కాజిగిరి నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకి కూడా టికెట్ ఖరారు చేయడం తెలిసిందే. అయితే ప్రస్తుతం మైనంపల్లి తనకు మాత్రమే కాకుండా తన కొడుకుకి మెదక్ నుంచి సీటు ఇప్పించాలని బీఆర్ఎస్ అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారట. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు పై మైనంపల్లి సీరియస్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. సిద్దిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ పక్కనే ఉన్న మల్కాజిగిరినీ కిప్ లాగా చూస్తున్నారని విమర్శలు చేశారు. దీంతో మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ గా తీసుకోవడం జరిగిందట.
ఇదే సమయంలో కేటీఆర్ తో పాటు ఎమ్మెల్సీ కవిత కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. దీంతో పార్టీకి వ్యతిరేకంగా కీలక నాయకుల విషయంలో మైనంపల్లి ఇష్టానుసారమైన వ్యాఖ్యలు చేయడంతో మల్కాజిగిరి సీటును వేరే వారికి కేటాయించాలని బీఆర్ఎస్ కీలక నాయకులు భావిస్తున్నట్లు సమాచారం.