Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పుడు లోక్ సభ ఎన్నికల జోరు హోరాహోరీగాా సాగుతుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రచారాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ భారీ బహిరంగ సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కేసీఆర్ కు ఇంకా అధికారం మత్తు దిగిందో లేదో అర్థం కావట్లేదని ,అలాగే ఫామ్ హౌస్ లో వేసిన మత్తు కూడా దిగిందో లేదో అర్థం కావడం లేదని అసెంబ్లీకి రమ్మంటే రాడని, చర్చల మీద మాట్లాడదామంటే పారిపోతాడు. ఎవరినో అడ్డం పెట్టుకొని అసెంబ్లీకి రాకుండా తప్పించుకుంటున్నాడు అంటూ రేవంత్ రెడ్డి తెలియజేశారు.
అసెంబ్లీకి రాని దద్దమ్మలు బడికి రాని బడి దొంగ లాంటివారు అంటూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి రాని ఈ దద్దమ్మ నిన్న వెళ్లి టీవీ9 లో కూర్చుని నాలుగు గంటల వరకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. పదేళ్లు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన కెసిఆర్ ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా సమస్యలపై స్పందించకుండా, నేటి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా, వెళ్లి టీవీ9 లో ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. వాడిని వదిలే ప్రసక్తే లేదని గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీలన్నింటినీ బయటికి లాగుతానని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలియజేశారు.
అసెంబ్లీలో మా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే ధైర్యం లేకనే కేసీఆర్ టీవీ9 కి వెళ్ళు ఇంటర్వ్యూ ఇస్తున్నాడని , ప్రగాబాలు మాట్లాడుతున్నాడని తెలిపారు. ఆయన మెదడును రంగరించి కాలేశ్వరం ప్రాజెక్టు కట్టిండట. దద్దమ్మ నువ్వు అట్లా కట్టినవో లేదో కాలేశ్వరం అలా కూలిపోయింది అంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవ చేశారు. ఈయన కంటే ప్రపంచంలో దివానా గాడు ఎవరైనా ఉంటాడా అంటూ వ్యాఖ్యానించారు.
నీకు దమ్ముంటే ఇప్పటికైనా రా కలిసి కాలేశ్వరం కి వెళ్దాం అక్కడ పరిస్థితులు చూద్దాం అంటూ రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. నువ్వు కట్టిన అద్భుతం ఏంటో ఆ అద్భుతం తెలంగాణ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకోవడానికి మేమందరం వస్తాం నువ్వు కూడా రా అంటూ రేవంత్ రెడ్డి కేసీఆర్ కు సవాల్ విసిరాడు. నీకు నిజంగా దమ్ము ధైర్యం చిత్తశుద్ధి ఉంటే కాలేశ్వరం ప్రాజెక్టు వద్దకు రా అంటూ రేవంత్ రెడ్డి కోరారు. దీంతో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో సభ మొత్తం దద్దరిల్లింది. మరి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.