Revanth Reddy : తెలంగాణా తెచ్చిన టీ ఆర్ ఎస్ మీద అప్పటి ముఖ్యమంత్రి అయిన కే సీ ఆర్ మీద ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత యనముల రేవంత్ రెడ్డి ఎన్నో విధాలుగా టార్గెట్ చేస్తూ వచ్చారు. అందులో బాగా వినిపించేది కే సీ ఆర్ చేసిన కుటుంబ పాలన. కే సీ ఆర్ ఫ్యామిలీ మొత్తం వారి కబంధ హస్తాలతో తెలంగాణాని దోచేస్తుంది అన్నట్టుగా రేవంత్ రెడ్డి పదే పదే కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఆయన మాటలు ప్రజల్లోకి బలంగా వెల్లడంతో ఈసారి ఆయనకు అధికారం కూడా ఇచ్చారు.ప్రస్తుతం తెలంగాణాలో కాంగ్రెస్ పాలన నడుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రఖ్యాతలు దెబ్బ రాకుండా ఉండటానికి చేస్తున్నారు. ఐతే తెర ముందు రేవంత్ రెడ్డి రాజకీయ ప్రక్షాలనకు తెర వెనక ఆయన సోదరులిద్దరి శ్రమ ఉంది. ఐతే సీఎం అయ్యాక రేవంత్ తన తమ్ముళ్లను కూడా రంగంలోకి దించితే కే సీ ఆర్ లానే తనది కుటుంబ పాలన అవుతుందని సోదరులిద్దరిని ఇంకా వెనకే ఉంచాడు. ఐతే అనూహ్యంగా రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి గురించి తెలంగాణా అంతటా చర్చ మొదలైంది.
ఇన్నాళ్లు రేవంత్ వెనక ఉన్న సోదరుడు తిరుపతి రెడ్డి ఇప్పుడు తెర మీదకు వచ్చినట్టు తెలుస్తుంది. తిరుపతి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా భారీ ప్లెస్లీఉ, పేపర్లో మెయిన్ ఎడిషన్ యాడ్స్ వచ్చాయి. అసలు తిరుపతి రెడ్డికి ఏ హోదా లేదు అలాంటి ఆయనకు మాట తప్పని మహనీయుడు. శత్రువులెరగని నాయకుడు, అలుపెరుగని ప్రజా సేవకుడు ఎనుముల తిరుపతి రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ యాడ్స్ కనిపించాయి.
ఇక దొరికిందే ఛాన్స్ అన్నట్టు బీ ఆర్ ఎస్ నేతలు ఈ వ్యవహారాన్ని హైలెట్ చేస్తూ కాంగ్రెస్ ప్రఘుత్వాన్ని ఎటాక్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై పలు రకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీ ఆర్ ఎస్ లో కే సీ ఆర్ చేసింది కుటుంబ పాలన అయితే ఇప్పుడు రేవంత్ చేస్తుంది ఏంటి అంటూ ప్రజలతో కలిసి బీ ఆర్ ఎస్ నేతలు కూడా టార్గెట్ చేస్తున్నారు. మరి తిరుపతి రెడ్డి రేవంత్ పర్మిషన్ తోనే ఇలా చేశాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా రేవంత్ సోదరుల పనితో సీఎం కి కొత తలనొప్పులు వచ్చి పడ్డాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.