Revanth reddy : పాపం.. రేవంత్ రెండు అడుగులు ముందుకు వస్తే సీనియర్‌లు పది అడుగులు వెనక్కు తోస్తున్నారట | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth reddy : పాపం.. రేవంత్ రెండు అడుగులు ముందుకు వస్తే సీనియర్‌లు పది అడుగులు వెనక్కు తోస్తున్నారట

 Authored By himanshi | The Telugu News | Updated on :11 February 2021,9:56 am

Revanth reddy : కాంగ్రెస్ పార్టీలో సీనిరయర్ లు జూనియర్‌లు అంటూ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. పార్టీలో అడుగు పెట్టిన జూనియర్ లను సీనియర్‌ లు తొక్కేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ కారణంగానే ఎన్నో సార్లు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు వచ్చి పార్టీ నుండి విడిపోయిన వారు ఉన్నారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని కాకుండా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ లో ఇదే పద్దతి కనిపిస్తుంది అనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే సీనియర్‌ ల పార్టీ అనే చర్చ కూడా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఈమద్య కాలంలో కాంగ్రెస్‌ లోకి రేవంత్ రెడ్డి వెళ్లాడు. ఆయన రాకను అందరు స్వాగతించినా కూడా పార్టీలో ఆయనకు ప్రాముఖ్యత ఇస్తామంటే మాత్రం వీహెచ్‌ వంటి సీనియర్‌ లు నో అంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి పార్టీ పరంగా ఏం చేయాలన్నా కూడా వెనక్కు లాగే ప్రయత్నాలు చేస్తున్నారు.

Revanth reddy situation in telangana congress party

Revanth reddy situation in telangana congress party

పాదయాత్రకు నో అంటున్న సీనియర్‌లు..

గతంలో రాజశేఖర్‌ రెడ్డి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇలా అందరు పాదయాత్రలు చేసి సీఎం పీఠంపై కూర్చున్నారు. అందుకే తాను కూడా సీఎం పీఠంపై కూర్చునే విషయం పక్కన పెడితే పార్టీని కనీసం బతికించుకునేందుకు పాద యాత్ర చేస్తానంటూ రేవంత్ రెడ్డి అధిష్టానం వద్ద పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నాడు. అయినా కూడా అధినాయకత్వం ఆయనకు ఓకే చెప్పడం లేదు. కారణం పార్టీ సీనియర్‌ నాయకులు అంటున్నారు. సొంత ఇమేజ్‌ ఫామ్‌ అయితే పార్టీకి నష్టం అంటూ సీనియర్ లు అధినాయకత్వంకు నూరి పోస్తున్నట్లుగా గుస గుసలు వినిపిస్తున్నాయి.

Revanth reddy : రేవంత్ రెడ్డి పీసీసీ కాలేడు..

తెలంగాణ కాంగ్రెస్‌ ఛీప్‌ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకుంటే బాగుంటుందని ఆ పార్టీ నాయకులతో పాటు చాలా మంది బలంగా కోరుకుంటున్నారు. కాని పార్టీ సీనియర్‌ లు మాత్రం రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌ అవ్వనిచ్చేది లేదు అంటున్నారు. నిన్నకాక మొన్న వచ్చిన రేవంత్‌ రెడ్డికి పీసీసీ ఇస్తే మేం ఏం చేయాలంటూ సీనియర్ లు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్‌ రెడ్డి పార్టీ బలోపేతంకు ఏం చేయలేక పోతున్నాడు అంటూ స్వయంగా ఆపార్టీకి చెందిన కొందరు నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్‌ లు జూనియర్‌ లు అనే కుమ్ములాటలు ఉన్నంత కాలం ఆ పార్టీ పూర్వ వైభవంను దక్కించుకోవడం అసాధ్యం అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది