Revanth Reddy : నెల‌లో కొత్త‌ ఉస్మానియా ఆసుపత్రి.. సీఎం రేవంత్ కీల‌క ఆదేశాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy : నెల‌లో కొత్త‌ ఉస్మానియా ఆసుపత్రి.. సీఎం రేవంత్ కీల‌క ఆదేశాలు..!

 Authored By ramu | The Telugu News | Updated on :11 January 2025,5:15 pm

ప్రధానాంశాలు:

  •  Revanth Reddy : నెల‌లో కొత్త‌ ఉస్మానియా ఆసుపత్రి.. సీఎం రేవంత్ కీల‌క ఆదేశాలు..!

Revanth Reddy : హైదరాబాద్ Hyderabad  నగరంలో కొత్త ఉస్మానియా ఆసుపత్రి osmania hospital నిర్మాణానికి ఈ నెలాఖరులోగా శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచించారు. కొత్తగా నిర్మించబోయే ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించిన ప్రణాళికలపై ముఖ్యమంత్రి గారు తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోషామహల్ పోలీస్ స్టేడియంలో ప్రతిపాదిత స్థలానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖ పరిధిలో ఉన్న ఆ స్థలాన్ని వీలైనంత త్వరగా వైద్యఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. రెండు శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రతిపాదిత స్థలంలో చేపట్టాల్సిన నిర్మాణాలకు సంబంధించిన నమూనా మ్యాప్‌లను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

Revanth Reddy నెల‌లో కొత్త‌ ఉస్మానియా ఆసుపత్రి సీఎం రేవంత్ కీల‌క ఆదేశాలు

Revanth Reddy : నెల‌లో కొత్త‌ ఉస్మానియా ఆసుపత్రి.. సీఎం రేవంత్ కీల‌క ఆదేశాలు..!

Revanth Reddy : మ్యాప్‌లలో ముఖ్యమంత్రి ఉస్మానియా ఆసుపత్రి పలు మార్పులు, చేర్పుల..

అధికారులు వివరించిన మ్యాప్‌లలో ముఖ్యమంత్రి గారు పలు మార్పులు, చేర్పులను సూచించారు. అన్ని రకాల ఆధునిక వసతులతో ఉండేలా ఆసుపత్రి నిర్మాణం ఉండాలని చెప్పారు.  ముఖ్యంగా రోడ్లు, పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నమూనాలను రూపొందించాలని సూచించారు. భవిష్యత్తులో రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్ లాంటి నిర్మాణాలు చేపట్టినా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ముందుచూపుతో డిజైన్లను రూపొందించాలన్నారు. అత్యాధునిక వసతులతో పాటు రోగుల సహాయకులు సేదతీరేందుకు గ్రీనరీ, పార్క్ లాంటి సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు.

కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా అత్యాధునిక వసతులతో ఆసుపత్రి నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు.  కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనాలు, ఇతర నమూనాలకు సంబంధించి పూర్తిస్థాయి డిజైన్లను రూపొందించాలన్నారు. ఆసుపత్రి నిర్మాణానికి ఈ నెలాఖరులో శంకుస్థాపన చేసేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది