CM Revanth Reddy : సాల్యూట్ CM రేవంత్..!
ప్రధానాంశాలు:
సాల్యూట్ CM రేవంత్..!
CM Revanth Reddy : తెలంగాణ ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా అభినందనీయం. హైదరాబాద్ సిటీలో చెరువుల ఆక్రమణల మీద హైడ్రా ఏ రకంగా విరుచుకుపడుతుందో అదే స్థాయిలో ఇప్పుడు ఆహార కల్తీని అరికట్టడానికి ఈగల్ పేరుతో సరికొత్త వ్యవస్థను తీసుకురావాలని నిర్ణయించడం సామాన్య జనాల్లో భరోసా నింపుతోంది. మనం తినే అన్నం దగ్గర నుంచి తాగే నీళ్ల వరకు ప్రతిదీ విషతుల్యం అవుతున్న ఈ రోజుల్లో ముఖ్యమంత్రి ఆలోచన ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతోంది.హోటళ్లలో కుళ్ళిన మాంసం వాడటం మరియు నకిలీ నూనెలు అలాగే రంగులు కలిపిన ఆహార పదార్థాల వల్ల సామాన్యులు రోగాల బారిన పడుతున్నారు. ఇన్నాళ్లూ కేవలం తనిఖీలు మరియు ఫైన్లతో సరిపెట్టిన ప్రభుత్వం ఇకపై అలా కుదరదని స్పష్టం చేసింది.
CM Revanth Reddy : సాల్యూట్ CM రేవంత్..!
ఈగల్ వ్యవస్థ ద్వారా కల్తీ చేసే వారి పని పట్టడమే కాకుండా వారికి కఠిన శిక్షలు పడేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ప్రజల ప్రాణాలతో ఆడుకునే వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చెప్పడం ఆయనకు ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధిని చూపిస్తోంది. అందుకే సామాన్యులంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి నిర్ణయానికి సాల్యూట్ చేస్తున్నారు.వ్యాపార లాభాల కోసం అడ్డదారులు తొక్కుతూ చిన్నారుల నుంచి ముసలివారి వరకు అందరి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కల్తీ గాళ్లకు ఈగల్ వ్యవస్థ ఒక సింహస్వప్నంలా మారబోతోంది. కేవలం సిటీకే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మూలన ఈ తనిఖీలు జరిగేలా యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. కల్తీ లేని తెలంగాణను చూడాలన్నది ముఖ్యమంత్రి ఆశయం. ఇది సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో ఆసుపత్రుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కల్తీ వ్యాపారుల గుండెల్లో వణుకు మొదలైంది. ఒక పక్క అభివృద్ధి పనులు చూస్తూనే మరోపక్క సామాన్యుడి ప్రాథమిక అవసరమైన స్వచ్ఛమైన ఆహారం కోసం ఇంతటి సాహసోపేతమైన అడుగు వేయడం నిజంగా గర్వించదగ్గ విషయం. రేవంత్ రెడ్డి మార్క్ పాలన అంటే ఇదే అని జనం చర్చించుకుంటున్నారు. ఆహార కల్తీ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం వంద శాతం విజయవంతం కావాలని ఆశిద్దాం. సామాన్యుల ఆరోగ్యం కోసం నిలబడ్డ ముఖ్యమంత్రికి హ్యాట్యాఫ్ చెప్పాల్సిందే.