Revanth Reddy : ఎంత ఎదిగిన మన తెలుగు భాషను గౌరవించాలి.. సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy : జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపించడంలో తెలుగువారి పాత్ర సన్నగిల్లుతోందని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. దేశంలో హిందీ తర్వాత అత్యధిక ప్రజలు మాట్లాడే తెలుగు భాషను, ఉనికిని, మనుగడను, మన సంప్రదాయాన్ని కోల్పోకుండా కాపాడుకోవలసిన అవసరం ఉందని చెప్పారు. world telugu federation conference ప్రపంచ తెలుగు సమాఖ్య (WTF) నిర్వహించిన 12 వ ద్వైవార్షిక సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సమాఖ్య ప్రచురించిన “తెలుగుదనం – తెలుగుధనం” పుస్తకాన్ని ఆవిష్కరించారు. గతంలో దేశ రాజకీయాల్లో ఎంతోమంది తెలుగువారు క్రియాశీలకంగా వ్యవహరించారని, నీలం సంజీవరెడ్డి గారు, పీవీ నరసింహారావు గారు, ఎన్టీఆర్ గారు, కాకా వెంకటస్వామి గారు, జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారి లాంటి వారు ఆనాడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహించారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి Revanth Reddy గారు గుర్తుచేశారు. రాజకీయం, సినీ, వాణిజ్య రంగాల్లో ఎంతస్థాయిలో రాణించినప్పటికీ మన భాషను మరిచిపోవద్దని, పరభాషా జ్ఞానం సంపాదించాలి కానీ, మన భాషను గౌరవించాలని అన్నారు.
Revanth Reddy : ఎంత ఎదిగిన మన తెలుగు భాషను గౌరవించాలి.. సీఎం రేవంత్ రెడ్డి
తెలుగు భాషను గౌరవిస్తూ ఈ మధ్య కాలంలో రైతులు రుణమాఫీ విషయంలో జీవోను తెలుగులో ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ జీవోలను తెలుగులో ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. న్యాయస్థానాల్లోనూ తీర్పు ప్రతులు తెలుగులో ఉంటే ఎంతోమందికి ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. హైదరాబాద్ నగరానికి మౌలిక సదుపాయాల కల్పనలో గతంలో చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రులు చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ, తెలంగాణ రైజింగ్ నినాదంతో 2050 అభివృద్ధి ప్రణాళికలతో తెలంగాణలో ముందుకు వెళుతున్నామని, ప్రపంచంలో అత్యున్నత నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని చెప్పారు.
వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. పెట్టుబడులకు సింగిల్ విండో పర్మిషన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు. ఈ సదస్సులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు, సమాఖ్య అధ్యక్షురాలు వీఎల్ ఇందిరా దత్ గారు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.