Ration Card : రేష‌న్ కార్డ్ క‌లిగిన వారికి ఝ‌ల‌క్ ఇచ్చిన ప్ర‌భుత్వం… ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుంది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ration Card : రేష‌న్ కార్డ్ క‌లిగిన వారికి ఝ‌ల‌క్ ఇచ్చిన ప్ర‌భుత్వం… ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుంది?

 Authored By sandeep | The Telugu News | Updated on :3 January 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Ration Card : రేష‌న్ కార్డ్ క‌లిగిన వారికి ఝ‌ల‌క్ ఇచ్చిన ప్ర‌భుత్వం... ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుంది?

Ration Card : పేద వర్గాలకు రేషన్ కార్డు ఎంతో ముఖ్యమైన ధ్రువపత్రం అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రేషన్ సరుకులు పొందడం మొదలు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత సాధించడం వరకూ ఈ కార్డు ఎంతో కీలకంగా పనిచేస్తుంది. అందుకే.. అర్హత ఉన్న ప్రతివారూ రేషన్ కార్డు క‌లిగి ఉంటారు. రేషన్ కార్డులు ప్రామాణికంగా తీసుకొని పలు కీలక పథకాలు అమలు చేస్తున్నారు. అటు ఏపీ, ఇటు తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై కసరత్తులు వేగవంతం చేస్తున్నారు. ఇదే సమయంలో రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.

Ration Card రేష‌న్ కార్డ్ క‌లిగిన వారికి ఝ‌ల‌క్ ఇచ్చిన ప్ర‌భుత్వం ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుంది

Ration Card : రేష‌న్ కార్డ్ క‌లిగిన వారికి ఝ‌ల‌క్ ఇచ్చిన ప్ర‌భుత్వం… ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుంది?

Ration Card  అంతా స‌స్పెన్స్…

సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమం జరగుతుంది. ఈసారి కూడా రేషన్ పంపిణీ ఉంటుంది. అయితే రేషన్ సరుకుల్లో భాగంగా ఇచ్చే కంది పప్పుకు సంబంధించి కొత్త సమస్య వచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికీ పూర్తి స్థాయిలో రేషన్ షాపులకు సరుకులు అంద‌డం లేదు. దాదాపు 40 శాతం షాపులకు మాత్రమే రేషన్ సరుకులు అంద‌డంతో రేష‌న్ పంపిణీ ఎలా చేస్తారో అని ప్ర‌తి ఒక్క‌రు ఆలోచిస్తున్నారు.పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ సెలవుపై వెళ్లడం, ఇంకా పూర్తి స్థాయిలో డీఎస్‌వో లేకపోవడం కూడా ప్ర‌తికూల ప్ర‌భావం చూపిస్తుంది.

మాములుగా అయితే ప్రతి నెలా 20 నుంచి 30 తేదీలోపు రేషన్ సరుకులు అన్నీ కూడా రేషన్ షాపులకు అందుతాయి. కాని ఇప్ప‌టి వ‌ర‌కు 60 శాతం రేష‌న్ షాపుల‌కి అంద‌లేదు. బియ్యం, చక్కెర స్టాక్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నా కూడా కంది పప్పు మాత్రం కొరత ఉండ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మ‌రోవైపు పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన కోడలు ఇలాంటి వారంతా ఇప్పటికే ఉన్న తమ కుటుంబ రేషన్ కార్డుల్లో పేర్లు యాడ్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. పౌర సరఫరాల సంస్థ అధికారులు మాత్రం ఈ నెల కచ్చితంగా ప్రతి రేషన్ కార్డు దారుడికి యథావిథిగానే సరుకుల పంపిణీ జరుగుతుంద‌ని చెబుతున్నా అది ఎంత స‌క్సెస్ అవుతుంద‌నేది చూడాలి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది