RTC Free Bus Scheme : మహిళలకి కోలుకోలేని దెబ్బ.. ఆగిపోనున్న ఫ్రీ బస్ స్కీమ్..?
ప్రధానాంశాలు:
RTC Free Bus Scheme : మహిళలకి కోలుకోలేని దెబ్బ.. ఆగిపోనున్న ఫ్రీ బస్ స్కీమ్..?
RTC Free Bus Scheme : Telangana తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం Congress Govt కొలువుదీరాక మహిళలకి ఫ్రీ బస్ స్కీమ్ Free Bus Scheme తీసుకొచ్చిన విషయం తెలిసిందే.అయితే అది ఇప్పుడు ఆగిపోనున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత బస్సు ప్రయాణం రద్దయ్యే ప్రమాదం పొంచి ఉన్నట్టు చర్చ జరుగుతోంది. తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టనున్న సమ్మె ప్రభావంతో ఉచిత బస్సు పథకంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉద్యోగులు అందరూ సమ్మెకు దిగితే ఉచిత బస్సు ఆగిపోతుందనే చర్చ జరుగుతోంది.తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో ప్రస్తుతం ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. రెండు పీఆర్‌సీలు బకాయి పడడం.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం హామీలను రేవంత్ రెడ్డి విస్మరించిన క్రమంలో సమ్మె చేపడుతున్నారు.

RTC Free Bus Scheme : మహిళలకి కోలుకోలేని దెబ్బ.. ఆగిపోనున్న ఫ్రీ బస్ స్కీమ్..?
RTC Free Bus Scheme పెద్ద దెబ్బే..
వారి ప్రధాన డిమాండ్స్ ఏంటంటే..ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం.,21వ వేతన సవరణ సంఘం ఏర్పాటు.సీసీఎస్, పీఎఫ్ బకాయిలు రూ.2,700 కోట్ల చెల్లింపు, 2 పీఆర్‌సీ అమలు, ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తే డ్రైవర్ల ఉపాధిపై ప్రభావం లేకుండా చట్టాలు రూపకల్పన. సీసీఎస్, పీఎఫ్ బకాయిలు రూ.2,700 కోట్ల చెల్లింపు. అయితే నాలుగేళ్ల తర్వాత ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఇప్పటికే సమ్మె నోటీసును ఆర్టీసీ యాజమాన్యానికి టీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు అందించారు. తమ 21 డిమాండ్లు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, 2021 జీతభత్యాల సవరణ, కండక్టర్ డ్రైవర్ల ఉద్యోగ భద్రత, విద్యుత్ బస్సులు ప్రభుత్వమే ఆర్టీసీ కొనుగోలు చేసి ఇవ్వాలి’ అని ప్రధాన డిమాండ్లు కార్మిక సంఘాలు చేస్తున్నాయి.. ప్రభుత్వం పరిష్కరించకపోతే మాత్రం వచ్చే వారం 9వ తేదీ నుంచి సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే కార్మిక సంఘాల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకునే అవకాశం లేనట్టు కనిపిస్తోంది. ఆర్టీసీ సమ్మె ఉండేట్టు స్పష్టంగా పరిణామాలు ఉన్నాయి. దీంతో ఒకవేళ సమ్మెకు గనుక ఆర్టీసీ ఉద్యోగులు వెళ్తే రోడ్డుపై ఆర్టీసీ బస్సులు తిరగవు. దీని ప్రభావంతో మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం అనేది కొనసాగదు. ఈ వార్తతో తెలంగాణ మహిళలు ఆందోళన చెందుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.