Home » News » Slbc Tunnel Accident Ends In Tragedy
News

SLBC : ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదం విషాదాంతం

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: February 28, 2025, 7:00 pm
Advertisement

SLBC : ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం విషాదాంతమైంది. ఈరోజు ఎస్ఎల్‌బీసీ SLBC టన్నెల్‌లో తప్పిపోయిన 8 మంది కార్మికుల మృతదేహాలను గుర్తించారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడానికి ఏడో రోజు శుక్ర‌వారం రెస్క్యూ ఆపరేషన్ కొన‌సాగింది. టీబీఎం మిషన్‌ను దక్షిణ మద్య రైల్వే నిపుణులు ప్లాస్మా గ్యాస్ కట్టర్స్‌తో కట్టింగ్ చేశారు. బురద, శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టగా వారి మృతదేహాలు బయటపడ్డాయి.

Advertisement

SLBC : ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదం విషాదాంతం

ఈ రోజు కార్మికుల జాడ కోసం అత్యాధునిక ‘గ్రౌండ్‌ పెనెట్రేటింగ్‌ రాడార్‌ (జీపీఆర్‌)’ టెస్టులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం జీపీఆర్‌ పరికరాన్ని గురువారం సొరంగం లోపలికి పంపింది. పైకప్పు కూలిపడ్డ చోట మట్టి, శిథిలాల కింద ఏముందనేది పరిశీలించారు. ఈ క్రమంలోనే మృతదేహాలను గుర్తించినట్లు తెలుస్తోంది. దాదాపు మూడు మీటర్ల లోతు మట్టిలో మృతదేహాలను ఉన్నట్లు గుర్తించారు.

Advertisement

అద్భుతం జరిగితే త‌ప్పా..

SLBC ఘటనలో స‌హాయ‌క చర్య‌ల‌ను ద‌గ్గ‌రుండి ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షించిన‌ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్ర‌వారం ఉద‌యం మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక అద్భుతం జరిగితే తప్ప సొరంగంలో చిక్కుకున్న 8 మంది బతికే అవకాశం లేదని అన్నారు. ప్రకృతి వైపరీత్యాన్ని BRS రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని, హరీష్ రావు, కేసీఆర్ మృతదేహాలపై పాప్‌కార్న్ పోస్తున్నారని ఆయన హాట్ కామెంట్స్ చేశారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి