Sitya Tanda : వృద్ధ తల్లిని నడ్డిరోడ్డుపై వదిలేసిన కొడుకు.. వీడియో..!
ప్రధానాంశాలు:
Sitya Tanda : వృద్ధ తల్లిని నడ్డిరోడ్డుపై వదిలేసిన కొడుకు.. వీడియో..!
Sitya Tanda : మానవ సంబంధాలు రోజు రోజుకు మంటగలసిపోతున్నాయనడానికి తాజా ఉదాహరణ. వృద్ధాప్యంలో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిని ఓ కొడుకు మహా నగరంలోని నడిరోడ్డుపై వదిలి పారిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ వనస్థలిపురం మన్సురాబాద్‌లో జరిగింది.

Sitya Tanda : వృద్ధ తల్లిని నడ్డిరోడ్డుపై వదిలేసిన కొడుకు.. వీడియో..!
ఇప్పుడే వస్తాను ఇక్కడే కూర్చో అని ఆ అమాయకపు వృద్ధ తల్లని నమ్మించి అక్కడ నుంచి ఊడాయించిన కొడుకు ఎంతకి తిరిగి రాకపోవడంతో దిక్కు తోచని స్థితిలో ఆ తల్లి కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉండిపోయింది. రెండు రోజులుగా వృద్ధురాలిని గమనించిన కాలనీవాసులు ఆ తల్లిని అక్కున చేర్చుకున్నారు. వివరాలు ఆరా తీయగా యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం వావిళ్లపల్లి గ్రామం సీత్యా తండాకు చెందిన వారుగా తెలిపింది. తల్లి పేరు ధర్మీ, ఆమె కొడుకు లక్ష్మణ్.
రెండు రోజుల క్రితం లక్ష్మణ్ ఆటోలో తన తల్లిని తీసుకొచ్చి ఇప్పుడే వస్తానని చెప్పి నడిరోడ్డు మీద కూర్చోబెట్టి వెళ్లిపోయాడు. వృద్ధురాలు రోడ్డుపై ఒంటరిగా ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు అబ్దుల్లాపూర్ మెట్ లోని ఆలేటి వృద్ధాశ్రమానికి వృద్ధురాలని తరలించారు. కొడుకు లక్ష్మణ్ ఆచూకీ తెలుసుకునేందుకు చర్యలు చేపట్టారు.
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్సురాబాద్ లో అమానవీయ ఘటన
తల్లిని నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయిన కొడుకు
వృద్ధురాలిని అక్కున చేర్చుకున్న కాలనీ వాసులు
పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అబ్దుల్లాపూర్ మెట్ లోని ఆశ్రమానికి తరలింపు pic.twitter.com/sWzZI2DafC
— BIG TV Breaking News (@bigtvtelugu) March 1, 2025