Rythu Runa Mafi : అర్హులైన రుణ‌మాఫీ కాలేదా.. వారికి గుడ్ న్యూస్ చెప్పిన పొన్నం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rythu Runa Mafi : అర్హులైన రుణ‌మాఫీ కాలేదా.. వారికి గుడ్ న్యూస్ చెప్పిన పొన్నం..!

Rythu Runa Mafi : తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల‌కి వ‌రుస గుడ్ న్యూస్‌లు చెబుతుంది. రైతాంగం ఎప్పుడప్పుడా అని ఎదురుచూస్తోన్న మూడో విడత రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేస్తామని ఉప-ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ తీరుతామన్న ముఖ్యమంత్రి ఎనముల రేవంత్‌రెడ్డి చేసిన సవాల్‌ను నిరూపించుకోనున్నామని ఆయన అన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం […]

 Authored By ramu | The Telugu News | Updated on :13 August 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Rythu Runa Mafi : అర్హులైన రుణ‌మాఫీ కాలేదా.. వారికి గుడ్ న్యూస్ చెప్పిన పొన్నం..!

Rythu Runa Mafi : తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల‌కి వ‌రుస గుడ్ న్యూస్‌లు చెబుతుంది. రైతాంగం ఎప్పుడప్పుడా అని ఎదురుచూస్తోన్న మూడో విడత రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేస్తామని ఉప-ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ తీరుతామన్న ముఖ్యమంత్రి ఎనముల రేవంత్‌రెడ్డి చేసిన సవాల్‌ను నిరూపించుకోనున్నామని ఆయన అన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జులై 18న రైతు రుణమాఫీని ప్రారంభించింది. మెుత్తం మూడు విడతల్లో మాఫీ చేస్తుండగా.. ఇప్పటికే రెండు విడతల్లో రూ. లక్ష, రూ. లక్షన్నర వరకు రుణాలు మాఫీ అయ్యాయి. ఆగస్టు 15న మూడో విడతగా రూ. లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Rythu Runa Mafi ఫుల్ క్లారిటీ..

ఇప్పటి వరకు రెండు విడతల్లో రుణమాఫీ జరగ్గా.. కొందరు అర్హులైన రైతులకు మాఫీ జరగలేదు. బ్యాంక్ అకౌంట్ నెంబర్లలో తప్పులు, ఆధార్ వివరాలు సరిపోలకపోవటం, వివిధ సాంకేతిక కారణాలతో రైతు రుణమాఫీ జరగలేదు. దీంతో ఆయా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తమకు రుణమాఫీ జరగలేదని బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్‌న్యూస్ చెప్పారు. అర్హతలు ఉన్నా.. రుణమాఫీ కాని రైతుల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు. అటువంటి వారి కోసం నెల రోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. రైతులెవరూ ఆధైర్యపడొద్దని.. ఆందోళనకు గురికావొద్దని సూచించారు. తమ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు.

Rythu Runa Mafi అర్హులైన రుణ‌మాఫీ కాలేదా వారికి గుడ్ న్యూస్ చెప్పిన పొన్నం

Rythu Runa Mafi : అర్హులైన రుణ‌మాఫీ కాలేదా.. వారికి గుడ్ న్యూస్ చెప్పిన పొన్నం..!

రుణమాఫీ, రైతుభరోసా పథకాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన విమర్శలను మంత్రి పొన్నం ఖండిస్తూ.. ఆయ‌న కీల‌క కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో హరీశ్‌ ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు సాంకేతిక కారణాలు చూపి 3 లక్షల మంది రైతులకు పంట రుణాలు మాఫీ చేయలేదని ఆయ‌న విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంటల బీమా అందక పరిహారం లేక చాలామంది రైతులు అప్పుల ఊబిలో చిక్కుకొని ఆత్మహత్యలు చేసుకున్నార‌ని పొన్నం తెలియ‌జేశాడు.. రైతు రుణమాఫీ జరగని వారు కాల్ చేయాలని ఇప్పుడు కాల్‌సెంటర్లు పెట్టారని.. అదేదో అప్పుడే పెట్టి ఉంటే రైతులకు మేలు జరిగేదని సూచించారు. అప్పుడేమో కలెక్షన్‌ సెంటర్లు పెట్టి.. ఇప్పుడు మెుసలి కన్నీరు కారుస్తున్నారంటూ హరీష్ శంక‌ర్ కి దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చారు..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది