Gas Cylinders : గ్యాస్ సిలిండర్ల సరఫర పై జనాల ఆందోళన .. కానీ ఇక్కడ మాత్రం భారీగా గ్యాస్‌ నిల్వలు .. ఎక్కడో తెలుసా? ..!

Authored By Sudheer Ramanujam | The Telugu News | Updated on : 24 March 2026, 2:00 pm
  •  Gas Cylinders : గ్యాస్ సిలిండర్ల సరఫర పై జనాల ఆందోళన .. కానీ ఇక్కడ మాత్రం భారీగా గ్యాస్‌ నిల్వలు .. ఎక్కడో తెలుసా? ..!

Gas Cylinders : వనపర్తి జిల్లా కేంద్రంలో గ్యాస్ సరఫరాపై ఎటువంటి సమస్యలు లేవని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి స్పష్టం చేశారు. రాజానగరం శివారులో ఉన్న శ్రీ వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీ గోదాంను ఆయన ఆకస్మికంగా సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా గోదాంలో ఉన్న రికార్డులను పరిశీలిస్తూ మొత్తం గ్యాస్ కనెక్షన్లు, ప్రస్తుత నిల్వలు, రోజువారీ డిమాండ్, సరఫరా వివరాలను సమగ్రంగా అధ్యయనం చేశారు. అధికారులు, ఏజెన్సీ మేనేజర్లతో మాట్లాడి సరఫరా వ్యవస్థపై వివరాలు తెలుసుకున్నారు. మేనేజర్లు ఇచ్చిన సమాచారం ప్రకారం గోదాంలో మొత్తం 1150 సిలిండర్లు నిల్వలో ఉన్నాయని తెలిపారు. రోజువారీ అవసరాల మేరకు 206 సిలిండర్లు పంపిణీకి పంపించగా ఇంకా 944 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ వివరాలను పరిశీలించిన కలెక్టర్ సరఫరా వ్యవస్థ సక్రమంగా కొనసాగుతోందని సంతృప్తి వ్యక్తం చేశారు.

sufficient stocks of gas cylinders for the people in Wanaparthy district.

sufficient stocks of gas cylinders for the people in Wanaparthy district.

Gas Cylinders :  ప్రజలకు భరోసా .. అవసరానికి సరిపడా నిల్వలు

జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని కలెక్టర్ స్పష్టంగా ప్రకటించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరానికి మించి తొందరగా సిలిండర్లు బుక్ చేసుకోవద్దని సూచించారు. సరఫరా వ్యవస్థను ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని, ప్రతి వినియోగదారుడికి సమయానికి సిలిండర్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రత్యేకంగా ప్రభుత్వ వసతి గృహాలు, ఆసుపత్రులు వంటి కీలక సంస్థలకు ఎలాంటి అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా జరగాలని అధికారులను ఆదేశించారు. ఈ సంస్థల అవసరాలను ముందుగానే గుర్తించి తగిన నిల్వలు ఉంచాలని సూచించారు. సరఫరాలో ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే స్పందించాలని హెచ్చరించారు.

Gas Cylinders :  అక్రమ వినియోగంపై కఠిన చర్యలు

డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ ఉపయోగాలకు వాడటం కఠినంగా నిషేధించబడిందని కలెక్టర్ మరోసారి హెచ్చరించారు. నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చేపట్టిన చర్యలపై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులను ప్రశ్నించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్ వివరాల ప్రకారం డొమెస్టిక్ సిలిండర్లను అక్రమంగా వాడుతున్న 25 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా 50 సిలిండర్లను సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, అక్రమ వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఈ తనిఖీ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ అధికారులు, డీటీలు, గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు కలెక్టర్‌తో పాటు పాల్గొన్నారు. జిల్లాలో గ్యాస్ సరఫరా వ్యవస్థపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ కొనసాగుతుందని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ భరోసా ఇచ్చారు.

Advertisement

Sudheer Ramanujam

Sudheer Ramanujam Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి