Telangana Congress : తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే సీట్లు ఎన్ని? ఆ సర్వేలో మొత్తం బయటపడింది
Telangana Congress : తెలంగాణలో అసలు ఏం జరుగుతోంది.. రాత్రికి రాత్రే రాజకీయాలు మారుతున్నాయి. దానికి కారణం.. త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగబోతుండటం. అవును.. ఇంకో మూడు నాలుగు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎప్పటికప్పుడు తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ఇక.. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మూడో సారి అధికారంలోకి రావడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. ఈసారి గెలిచి తెలంగాణలో తమ సత్తా చాటాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ రెండు పార్టీల నడుమ బీజేపీ కూడా తెలంగాణపై దృష్టి సారించింది.
అయితే.. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పుంజుకుంటున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజంగానే కాంగ్రెస్ పుంజుకుందా.. అనే దానిపై పార్టీ కూడా సర్వే నిర్వహించిందట. అసలు తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి.. వచ్చే ఎన్నికల్లో గెలిచే చాన్స్ ఉందా అనే దానిపై సర్వే నిర్వహించగా.. సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు.. కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలంగాణ పరిస్థితులపై కీలక నివేదిక సమర్పించారట. నియోజకవర్గాల వారీగా అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనాలు వేసి వివరించారట. ఆ నివేదిక ఆధారంగానే పార్టీ నేతలతో ఏఐసీసీ ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ సమావేశం అయ్యారు. వాళ్లకు కీలక సూచనలు చేశారు.అయితే.. తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాలు ఉండగా.. అందులో సునీల్ కనుగోలు ఇచ్చిన నివేదిక ప్రకారం 17 నియోజకవర్గాలను మూడు కేటగిరీలుగా విభజించారు. అలాగే.. అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా డివైడ్ చేశారు.
Telangana Congress : 17 లోక్ సభ సీట్లు మూడు కేటగిరీలుగా విభజన
తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 41 నియోజకవర్గాల్లో గెలిచే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకో 42 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉండబోతుందట. మరో 36 స్థానాల్లో గెలవడం అసాధ్యం అట. ఏది ఏమైనా.. గెలుపు అవకాశాలు ఏ నియోజకవర్గాల్లో అయితే ఉన్నాయో.. ఆ నియోజకవర్గాల్లో కాస్త దూకుడుగా ప్రవర్తించి గెలుపును ఖాయం చేసుకోవాలని పార్టీ నేతలకు సూచనలు చేశారు.